నేలచూపులతో మార్కెట్లు షురూ | Market open in negative zone | Sakshi
Sakshi News home page

నేలచూపులతో మార్కెట్లు షురూ

Oct 26 2020 9:36 AM | Updated on Oct 26 2020 9:38 AM

Market open in negative zone - Sakshi

ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 40,536ను తాకింది. నిఫ్టీ 50 పాయింట్లు క్షీణించి 11,880 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో నిలవగా.. ఆసియాలో మిశ్రమ ధోరణి కనపిస్తోంది. గురువారం అక్టోబర్‌ ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుండటంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఐటీ, రియల్టీ, బ్యాంకింగ్‌, మీడియా రంగాలు 1-0.5 శాతం మధ్య నీరసించగా.. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 0.2 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్‌ఐఎల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటో, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ 2.3-0.7 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్‌, నెస్లే, ఎల్‌అంఢ్‌టీ, ఐషర్‌, ఐవోసీ, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, శ్రీసిమెంట్‌ 3.5-0.6 శాతం మధ్య ఎగశాయి.

కోఫోర్జ్‌ డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో కోఫోర్జ్‌, జిందాల్‌ స్టీల్‌, నౌకరీ, చోళమండలం, ఎస్కార్ట్స్‌, బయోకాన్‌, మణప్పురం, బంధన్‌ బ్యాంక్‌ 4.6-1.3 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. బీహెచ్‌ఈఎల్‌, వేదాంతా, అరబిందో, పెట్రోనెట్‌, ఐబీ హౌసింగ్‌ 3.4-1.2 శాతం మధ్య పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 932 లాభపడగా.. 670 నష్టాలతో కదులుతున్నాయి,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement