మహీంద్రా ఆన్‌ ది మూవ్‌

Mahindra On The Move One way or another - Sakshi

మహీంద్రా ఇండస్ట్రీస్‌ బాస్‌ ఆనంద్‌ మహీంద్రానే అదిరిపడే ఫోటోలు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆయనతో షేర్‌ చేసుకుంటారు. ఇలాంటి ఫోటోల్లో ఆకట్టుకునే అంశం ఏదైనా ఉంటే వెంటనే ఆనంద్‌ మహీంద్రా ఆ విషయాన్ని తన ట్వీట్‌ ద్వారా వెల్లడిస్తారు. తాజాగా ఓ నెటిజన్‌ పంపిన విచిత్రమైన ఫోటోను షేర్‌ చేస్తూ ఆసక్తికర కామెంట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.

మమీంద్రా కమాండర్‌ జీపుకు చెందిన బాడీని నాలుగు చక్రాల తోపుడు బండికి ఫిట్‌ చేసిన ఫోటోను ఓ వ్యక్తి ఆనంద్‌ మహీంద్రా దృస్టికి తీసుకువచ్చాడు. అంతేకాదు మహీంద్రా ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటుంది. ఒక దారిలో కాకపోతే మరోదారిలో అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనికి తనదైన శైలిలో ఆనంద్‌ మహీంద్రా బదులిస్తూ మీరు చెప్పింది నిజమే. మనమెప్పుడు ముందుకు కదుల్తూనే ఉండాలి. మనసుంటే మార్గం ఉంటుందన్నారు.

చదవండి: ఒక్కోమెట్టు ఎక్కుదాం.. గమ్యాన్ని చేరుకుందాం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top