Sakshi News home page

ద్రవ్యోల్బణం.. తీవ్ర అనిశ్చితే

Published Sat, Dec 23 2023 5:48 AM

Inflation clouded by volatile food prices, weather shocks - Sakshi

ముంబై: అస్థిరత, అనిశ్చిత ఆహార ధరల కారణంగా రిటైల్‌  ద్రవ్యోల్బణం– అవుట్‌లుక్‌ తీవ్ర అస్పష్టంగా ఉందని ఇటీవలి  ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. శక్తికాంత దాస్‌ నేతృత్వంలో డిసెంబర్‌ 6 నుండి 8 వరకూ జరిగిన  ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినిట్స్‌ శుక్రవారం విడుదలయ్యింది.

  ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉటంకిస్తూ కీలక వడ్డీ రేటు (బ్యాంకులు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో) 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా ఈ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూరగాయల ధరల తీవ్రత వల్ల ఆహార ద్రవ్యోల్బణం పుంజుకునే వీలుందని ఈ సమావేశంలో గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య పరపతి విధాన వైఖరిలో ఏదైనా మార్పు ఉంటే అది ప్రమాదకరమని దాస్‌ ఉద్ఘాటించారు.

Advertisement
Advertisement