ఎలక్ట్రిక్ వాహనాలు ఎప్పటికీ అదే రేంజ్ ఇస్తాయా?

How much range is your electric vehicle losing every year - Sakshi

ఎలక్ట్రిక్ వాహనాలును ఇంధన వాహనాలతో పోలిస్తే ధీర్ఘ కాలంలో తక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పుకోవచ్చు. రేంజ్ ఎక్కువ లేకపోవడం, అధిక వాహన ధర, పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వంటి సమస్యలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలలో ఈవీలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రంగం జోరు మీద ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులు ఎదుర్కునే ప్రధాన సమస్య బ్యాటరీలు. 

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల సగటు రేంజ్ ఒకే సారి ఛార్జ్ చేస్తే సుమారు 70 కిలోమీటర్ల వరకు వస్తుంది. కొన్ని ఇతర ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను ఒకసారి ఛార్జ్ చేస్తే 200కి పైగా రేంజ్ అందిస్తాయి. అయితే, ఎలక్ట్రిక్ వేహికల్ లైఫ్ సైకిల్ ఎప్పుడు ఒకేవిధంగా ఉండదు. ఐసీఈలు, మొబైల్ ఫోన్ బ్యాటరీల మాదిరిగానే రీఛార్జబుల్ లిథియం-అయాన్ ఈవి బ్యాటరీలు, మోటార్లు కాలంతో పాటు క్షీణిస్తాయి. ఇది ఎలక్ట్రిక్ వేహికల్ పనితీరు, రేంజ్'పై ప్రభావం చూపుతుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

(చదవండి: గృహ, వాహన రుణాలను తీసుకోనే వారికి గుడ్‌న్యూస్‌..!)

సమయం
ఇంధన వాహనాల మాదిరిగా కాకుండా? ఎలక్ట్రిక్ వాహనాల కాలవ్యవధి బ్యాటరీలపై ఆధారపడి ఉంటుంది. సులభంగా చెప్పాలంటే? మన ఫోన్ కొన్నప్పుడు ఫోన్ బ్యాటరీ అనేది ఎక్కువ కాలం వస్తుంది. అదే ఒక ఏడాది ఎంతో కొంత తగ్గుతుంది. ఎందుకుంటే మన బ్యాటరీ సేల్స్ కాలవ్యవది రోజు రోజుకి తగ్గిపోతుంది. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ కాలం కూడా తగ్గి పోతుంది. లిక్విడ్ కూల్డ్, కొత్త తరం ఈవి బ్యాటరీలు తక్కువ శాతం క్షీణతతో వస్తాయి. ఇప్పుడు వచ్చే కొత్త థర్మల్ మేనేజ్ మెంట్ సిస్టమ్, కొత్త టెక్నాలజీల బ్యాటరీల కాల వ్యవది పెరుగుతుంది.

ఉష్ణోగ్రత
బ్యాటరీ పనితీరులో ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. చల్లని ఉష్ణోగ్రతల సమయంలో ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల తాత్కాలికంగా రేంజ్ కూడా తగ్గిపోతుంది. మరోవైపు వేసవి కాలంలో బ్యాటరీలు వేగంగా చార్జ్ అయినప్పటికీ అవి పేలే అవకాశం ఉంది. అయితే, ఎండ కాలం, వాన కాలం, చలి కాలం వల్ల దీర్ఘకాలంలో బ్యాటరీ పనితీరు, రేంజ్ అనేది తగ్గే అవకాశం ఉంది. (చదవండి: హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే!)

ఛార్జింగ్ అలవాటు
బ్యాటరీ జీవితకాలం అనేది రోజుకి/వారానికి ఎన్ని సార్లు చార్జ్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు గనుక బ్యాటరీ పూర్తి అయ్యేంత వరకు చార్జ్ చేయకపోయిన, తరచు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఫాస్ట్ ఛార్జింగ్
ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఈవీ కొనేవారికి చాలా ఆకర్షణీయంగా ఉండవచ్చు. కానీ, ఇది వాస్తవానికి బ్యాటరీ కణాలను దెబ్బతీస్తుంది. ఇది చివరికి ఈవీ బ్యాటరీ పనితీరు, పరిధి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మీరు వాడే ఎలక్ట్రిక్ వాహన జీవిత కాలం ప్రతి ఏడాది తగ్గిపోతుంది. ఒకవేల కంపెనీలు గనుక బ్యాటరీ తక్కువ ఖర్చుతో మార్కెట్లోకి తీసుకొని వస్తే మీకు అది ఒక శుభవార్త. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top