మీకు ఎంత జీవిత బీమా అవసరం..! ఇలా తెలుసుకోండి...

How Much Life Insurance Do You Need Decide By Yourself - Sakshi

కోవిడ్‌-19 మహమ్మారి రాకతో చాలా మంది జీవితాలు చిద్రమైపోయాయి. కరోనా చూపిన ప్రభావం చాలా మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాల్లో  బీమా పాలసీలు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం కల్గింది. కాగా  కరోనా రాకతో ఇప్పుడు చాలా మంది  పాలసీలను తీసుకోవడానికి సన్నద్దమవుతున్నారు. ఏలాంటి పాలసీలను తీసుకోవాలనే సందిగ్ధంలో నెలకొని ఉన్నారా..! అయితే ఇది మీకోసమే. ఎజెంట్లు చెప్పే మాయమాటలకు నమ్మకుండా మీ సొంతంగా ఏ పాలసీ మీకు సరిపోతుందో తెలుసుకోండి.

బీమా తీసుకోవడంతో అనుకొని​ దురదృష్టకర సంఘటనల నుంచి మనల్ని మనం కాస్త కాపాడుకున్నా వాళ్లం అవుతాం. మీ జీవిత బీమాను తెలసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవిత బీమా ముందుగా మీకు వచ్చే వార్షిక ఆదాయంపై ఆధాపడి ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రస్తుత వయసు, పదవీ విరమణ పొందే వయసుపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే అంతా మంచింది.

మీకు ఎంత బీమా అవసరం.. అనే అంచనాలను ఇలా వేయండి.

  • మీరు తీసుకునే వ్యక్తిగత జీతం నుంచి మీ వ్యక్తిగత ఖర్చులను తగ్గించడం ద్వారా మీ కుటుంబ నెలవారీ గృహ ఆదాయానికి మీరు ఎంతవరకు సహకరిస్తారో లెక్కించండి.
  • మీ కుటుంబానికి మీరు రిటైర్‌మెంట్‌ అయ్యే లోపు ఎంతమేరకు ఆదాయాన్ని సంపాదిస్తారో లెక్కించండి. రిటైర్‌మెంట్‌లోపు వచ్చే ఇంక్రిమెంట్లతో సహా మొత్తాన్ని లెక్కించండి.
  • మీరు ఆశించే మొత్తం ఆదాయం ప్రస్తుత విలువను కనుగొనండి. అంతేకాకుండా మారుతున్న కాలానికి తగ్గట్లుగా పాలసీలను ఎంపిక చేసుకోవడం మంచింది. 

జీవిత బీమాలు,  ఆరోగ్య బీమాలు వేరవేరుగా ఉంటాయి. ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు వయసు ను పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత చిన్న వయసు లో పాలసీ తీసుకుంటే అంత మంచిది.  ఆరోగ్య బీమాలను ప్రతి సంవత్సరం 10 నుంచి 15 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఫామిలీ ఫ్లోటర్ పాలసీ ద్వారా మొత్తం కుటుంబాన్ని ఆరోగ్య బీమా పరిధి లోకి తీసుకురావచ్చు. కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం కన్నా..ఒకే పాలసీ తో అందరికి బీమా రక్షణ కల్పించడం ఉత్తమమైన మార్గం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top