
సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్రా ఈసారి వర్క్ ఫ్రం హోంపై స్పందించారు. 2020 మార్చి 24న లాక్‌డౌన్ విధించింది మొదలు వర్క్ కల్చర్ అంతా మారిపోయింది. ఒకాదిన వెంట ఒకటిగా కరోనా వేవ్స్ వస్తుండటంతో వర్క్ ఫ్రం హోంకి తెర పడలేదు. ఉద్యోగులు లేక ఆఫీసులు వెలవెలబోయాయి.
తాజాగా ఒమిక్రాన్‌తో వచ్చిన థర్డ్ వేవ్‌తో మరోసారి ఉద్యోగులు ఆఫీసులకు రానక్కర్లేది ఇంటి నుంచి పని చేసుకోవచ్చంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే గతానికి కంటే భిన్నంగా ఈ సారి త్వరగా కోవిడ్ వేవ్ ముగిసి పోయింది. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కళకళాడుతున్న కార్యాలయానికి సంబంధించి వార్తను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారాయన.
Hello normal life. It’s good to see you again… pic.twitter.com/OKgIfIAw7P
— anand mahindra (@anandmahindra) February 7, 2022