అరెభాయ్‌.. బయటకురా.. వర్క్‌ ఫ్రం హోంపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు స్పందన

Harsh Goenka Funny Meme On Work From Home - Sakshi

కరోనా థర్డ్‌ వేవ్‌ మన దేశంలో నామమాత్రం కావడంతో క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మాస్క్‌లు, సామాజిక దూరం తప్ప మిగిలిన కరోనా ఆంక్షలన్నీ 2022 ఏప్రిల్‌ 1 నుంచి రద్దయిపోతాయంటూ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వర్క్‌ ఫ్రం హోం విధానం అమలు చేసిన కంపెనీలు క్రమంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. 

ఇప్పటికే ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వర్క్‌ ఫ్రం హోంపై స్పందిస్తూ.. ఈ మోడల్‌ భారతీయులకు నప్పదని. ప్రొడక్టివి దెబ్బతింటుందంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ హింట్‌ ఇచ్చారు. ఆయన బాటలోనే మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా స్పందించారు. కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంకి గుడ్ బై ఉద్యోగులను ఎలా ఆఫీసులకు పిలుస్తున్నాయో చూడండి అంటూ అరేభాయ్‌ నికల్ ఆవో ఘర్‌ సే అనే పాత బాలీవుడ్‌ సాంగ్‌ని ట్విట​‍్టర్‌లో పోస్ట్‌ చేశారు. హర్ష్‌ గోయెంకా టైమింగ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top