Gmail: మొన్న ఫేస్‌బుక్‌ డౌన్‌..! ఇప్పుడు జీ మెయిల్‌..!

Gmail Not Working For Many In India - Sakshi

Gmail Services Down In India: ప్రపంచవ్యాప్తంగా ఏడుగంటల పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో జీమెయిల్‌ సేవలు  నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జీమెయిల్‌ సేవలు డౌన్‌ అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటలనుంచి జీమెయిల్‌ సేవలు పనిచేయడం లేదంటూ ట్విటర్‌ వేదికగా యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. 
చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..!


ఊక్లాకు చెందిన డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో సుమారు 68 శాతం మంది యూజర్లు జీమెయిల్‌ పనిచేయడం లేదంటూ రిపోర్ట్‌ చేశారు. 18 శాతం యూజర్లు సర్వర్‌​ సమస్యలను, 14 శాతం మంది యూజర్లకు లాగిన్‌ సమస్యలు తలెత్తిన్నట్లు డౌన్‌ డిటెక్టర్‌లో వెల్లడించింది. కొంత మంది యూజర్లు #GmailDown పేరిట ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. కాగా నిలిచిపోయిన జీమెయిల్‌ సేవలపై గూగుల్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.  గూగుల్‌ ఈ సమస్యలకు పరిష్కారం వెంటనే గూగుల్‌ చూస్తోందని యూజర్లు భావిస్తున్నారు. 

చదవండి: ముంచుకొస్తున్న సౌర తుఫాన్‌..! అదే జరిగితే అంధకారమే...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top