Facebook: ఫేక్‌ కంటెంట్‌లో నెంబర్‌ వన్‌! క్లిక్స్‌ పడడానికి కారణం ఏంటంటే..

Facebook Fake Content More Views Than Actual Facts Says Study - Sakshi

సరదా పోస్టులతో అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సాధనం, సీరియస్‌ చర్చలతో ఉద్యమాలకు బీజం వేయడం.. ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడో కమర్షియల్‌ మోజులో జెన్యూన్‌ ఫన్‌ అనేది జంక్‌తో నిండిపోతోంది. సీరియస్‌ చర్చల స్థానంలో అప్రస్తుతమైన, అవసరమైన అంశాలపై వాదోపవాదనలు నడుస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అప్పుడు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఫేస్‌బుక్‌ .. తప్పుడు సమాచారాన్ని అందించే  ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది.  

యస్‌.. ఫేస్‌బుక్‌, ఇప్పుడు ఫేక్‌ సమాచారంతో యూజర్‌ను తప్పుదోవ పట్టించడంలో నెంబర్‌ వన్‌గా ఉంది. సాధారణ పోస్టుల కంటే, వాస్తవ కథనాల కంటే ఆరు రెట్లు తప్పుడు, తప్పుడుదోవ పట్టించే సమాచారాన్ని యూజర్లు క్లిక్‌ చేయాల్సి వస్తోంది. ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌ ఆల్ప్స్‌ యూనివర్సిటీ చేపట్టిన ఓ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది యూజర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో.. తమను తప్పుదారి పట్టిస్తున్న ఫేస్‌బుక్‌ను.. ‘ఫేక్‌ బుక్‌’గా యూజర్లు ఈ సర్వేలో వ్యవహరించడం విశేషం. ముఖ్యంగా సీరియస్‌ విషయాల్లో పక్కదారి పట్టించే అంశాలపై యూజర్లు గుర్రుగా ఉన్నారు. ఇక ఫేక్‌ ప్రచారాల్లో సగం వాటా మీడియా సంస్థల ద్వారా,  మరో 20 శాతం రాజకీయ నాయకుల వాటా ఉంటుండగా..  మిగిలిన 30 శాతం ఇతర యూజర్ల నుంచి ఫేస్‌బుక్‌ వాల్‌ మీదకు చేరుతోంది.    క్లిక్‌: సోషల్‌ మీడియా కిరాణం!

హెడ్డింగులే..
యూట్యూబ్‌ థంబ్‌నెయిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాకు చేరాయి. ఆ మిస్‌ లీడ్‌ కంటెంట్‌ వల్లే యూజర్లు ఆకర్షితులు అవుతున్నారని న్యూయార్క్‌ యూనివర్సిటీ రీసెర్చర్లు(ఆగస్టు 2020-జనవరి 2021 మధ్య ఎన్నికల టైంలో జరిగిన సర్వే) చెప్తున్నారు. సాధారణంగా సోషల్‌ మీడియాను మీడియా కంటే ముందుగా క్విక్‌ అప్‌డేట్స్‌ అందించే సాధనంగా యూజర్లు భావిస్తుంటారు. అదీగాక ఏదైనా ఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన కొనసాగింపు ప్రస్థానాలన్నీ సోషల్‌ మీడియాకే చేరుతుంటాయి. అందుకే టీవీలు, యూట్యూబ్‌లాంటి లైవ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంటే ముందు.. సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తుంటాడు యూజర్‌.
 

ఈ క్రమంలో కనిపించిన ప్రతీదాన్ని క్లిక్‌ చేయడం వల్ల ఫేక్‌ ఇన్‌ఫర్మేషన్‌కి తెలియకుండానే ఆదరణ ఎక్కువ ఉంటోందని సర్వే ద్వారా తేల్చి చెప్పారు. అయితే ఫేస్‌బుక్‌లో మునుపటిలా హెల్తీ చర్చలు జరగకపోవడం, ఫేక్‌ సమాచారం వ్యాపించడం.. ఈ ప్రభావాలతోనే యూజర్‌ మానసిక స్థితి సోషల్‌ మీడియాలో ప్రతిబింబిస్తోందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. ఫేస్‌బుక్‌ మాత్రం ఆ స్టడీని తోసిపుచ్చుతోంది. కంటెంట్‌ ఎలా ఉన్నా జనాలు ఎలా ఇంటెరాక్ట్‌ అవుతారు. నచ్చితేనే లైకులు కొట్టి, షేర్లు చేసేది అని వ్యాఖ్యానించారు ఫేస్‌బుక్‌ ప్రతినిధి జోయ్‌ ఓస్‌బార్నె. అంతేకాదు ఫేక్‌కంటెంట్‌ కట్టడికి ఫేస్‌బుక్‌ తీవ్రంగా శ్రమిస్తోందని, ప్రపంచంలోని  60 భాషల్లో 80 ఫ్యాక్ట్‌ చెక్టింగ్‌ బ్లాగులతో కలిసి అలాంటి కంటెంట్‌ తొలగింపు కోసం పని చేస్తోందని జోయ్‌ చెప్తున్నారు. 

చదవండి: వాట్సాప్‌లో ఎడిట్‌ ఫొటోల్ని వాడితే ప్రమాదమా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top