బిగ్ షాక్.. భారత్‌లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్! | Doha Bank To Close Two Branches In India, Will Operate Only Through Representative Office | Sakshi
Sakshi News home page

బిగ్ షాక్.. భారత్‌లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్!

Mar 29 2026 4:28 PM | Updated on Mar 29 2026 6:20 PM

Doha Bank Closes India Branches

భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్‌లోని దోహా బ్యాంక్ తన భారత్‌లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్‌లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్‌డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్‌లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.

ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement