
సిట్రోయెన్ ఇండియా.. దేశీయ మార్కెట్లో 'ఎయిర్‌క్రాస్ ఎక్స్' లాంచ్ చేసింది. ఈ కారు ధరలు రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కంపెనీ ఈ లేటెస్ట్ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
కొత్త డీప్ ఫారెస్ట్ గ్రీన్ రంగులో కనిపించే ఈ కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్.. ఎంట్రీ & పుష్ స్టార్ట్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో ఐఆర్వీఎం, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది.
లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ ఫ్రెంచ్ బ్రాండ్ కారు.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. కాబట్టి ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.
ఇదీ చదవండి: 8 నెలలు.. 30000 సేల్స్: అమ్మకాల్లో కైలాక్ హవా!
ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ & 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను మాత్రమే పొందుతుంది. రెండోది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది.