బీఎండబ్ల్యూ బైక్స్‌ కొత్త వెర్షన్లు 

BMW R nineT Price BS6, Mileage, Price in India - Sakshi

ముంబై: బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ శుక్రవారం తన ఆర్‌ నైన్‌ టీ, ఆర్‌ నైన్‌ టీ స్కాంబ్లర్‌ మోడళ్ల కొత్త వెర్షన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ధరలు వరుసగా రూ.18.5 లక్షలు, రూ.16.75 లక్షలు(ఎక్స్‌ షోరూమ్‌)గా ఉన్నాయి. బీఎస్‌–6 ప్రమాణాలను కలిగిన ఈ రెండు బైకుల బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. వీటిలో 1,170 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను అమర్చారు. కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. గంటకు గరిష్టంగా 200 వేగంతో ప్రయాణించగలవు. బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ షోరూముల్లో ఈ కొత్త బైక్‌లను బుక్‌ చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌పై స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కన్ను 
న్యూఢిల్లీ: దేశీ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విభాగంలో ప్రవేశించేందుకు వీలుగా ఈనెల్‌ ఎక్స్‌తో చేతులు కలిపినట్లు స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ పేర్కొంది. తద్వారా సమాన వాటా (50:50)తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కాగా, క్విక్‌ ఎలక్ట్రిక్‌ చార్జర్‌ సౌకర్యాలతో దేశీ ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు స్టెర్లింగ్‌ జనరేటర్స్‌ సీఈవో సంజయ్‌ జాధవ్‌ అభిప్రాయపడ్డారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top