Ola Electric: ఓలా సంచలన నిర్ణయం.. త్వరలో ఆ దేశంలోకి ఎంట్రీ!

Bhavish Aggarwal: We will soon bring our S1 to London in a special Union Jack colour - Sakshi

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మరో సంచలనానికి సై అంటోంది. ఇప్పటికే దేశం నలుమూలల ఓలా స్కూటర్లు పరుగులు పెడుతుండగా త్వరలో విదేశీ రోడ్లపై రయ్‌రయ్‌మని దూసుకుపోయేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

త్వరలోనే యూనెటైడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో ఓలా ఎస్‌ 1 ప్రో స్కూటర్లు ప్రవేశపెడతామని ఓలా ఫౌండర్‌ కమ్‌ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. బ్రిటీష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌వెల్లీస్‌తో ఆయన గురువారం సమావేశం అయ్యారు. ఓలా స్కూటర్‌ తయారీలో ఉపయోగిస్తున్న టెక్నాలజీని బ్రిటీష్‌ హైకమిషనర్‌కు వివరించారు భవీష్‌ అగర్వాల్‌. అదే విధంగా యూకే, ఇండియా పార్టనర్‌షిప్‌లో చేపట్టాల్సిన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అంశాలు సైతం వీరి మధ్య చోటు చేసుకున్నాయి.

బ్రిటీష్‌ హైకమిషనర్‌ ప్రధానంగా ఇండియా, యూకే వాణిజ్య సంబంధాలపై చర్చించారు. దీంతో ఓలా స్కూటర్‌ను యూకేలో ప్రవేశపెట్టే విషయంపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో భవీష్‌ అగర్వాల్‌ త్వరలో లండన్‌లో ఓలా ఎస్‌ 1 ప్రో పరుగులు పెట్టబోతుందంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు లండన్‌ కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ యూనియన్‌ జాక్‌ కలర్‌లో స్కూటర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్టు వెల్లడించారు. 

చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top