ఓరి మీ దుంపదెగ..అంతరిక్షంలోనూ టిక్‌ టాక్‌ వీడియోలు!

Astronaut Samantha Cristoforetti Making First Ever Tiktok In Space - Sakshi

టిక్‌టాక్‌ ప్రపంచ దేశాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్‌ వర్కింగ్‌ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనాకు చెందిన షార్ట్‌ వీడియో యాప్‌ భూమ్మీదే కాదండోయ్‌...అంతరిక్షంలోనూ ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది.

ఇటలీకి చెందిన 45ఏళ్ల యురేపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఆస్ట్రోనాట్‌ సమంత క్రిస్టోఫోరెట్టి టిక్‌టాక్‌ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న అంతరిక్షంలో ఉన్న ఈఎస్‌ఏకి చెందిన ఆర్బిటింగ్‌ ల్యాబ్‌కు చేరుకున్నారు. 6నెలల పాటు అక్కడ ఉండనున్నారు. అనంతరం భూమ్మీదకు చేరుకోనున్నారు. 

అయితే ఈ నేపథ్యంలో ఈఎస్‌ఏ నుంచి 88 సెకన్ల టిక్‌ టాక్‌ వీడియో చేశారు. ఈ వీడియోలో స్పేస్‌ఎక్స్‌ఎస్‌ క్రూ-4 మెషిన్‌లో భాగంగా టూ 'జీరో - జీ ఇండికేటర్స్‌' తో పాటు ఎట్టా అనే మంకీ బొమ్మ గురించి వీడియోలో పేర్కొన్నారు. సమంతా తీసిన టిక్‌ టాక్‌ వీడియోను 2లక్షల మందికి పైగా వీక్షించగా..8వేల లైక్స్‌ వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

చదవండి👉ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top