Zoom: జూమ్‌ యూజర్లకు అలర్ట్‌..!

Apple Mac Users BEWARE Zoom Is Recording You Even When Not In Use - Sakshi

కరోనా రాకతో ఉద్యోగులు, విద్యార్థులు పూర్తిగా ప్రముఖ వీడియో మీటింగ్‌ యాప్లికేషన్‌ జూమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. తాజాగా జూమ్‌ ప్లాట్‌ఫాంలో బగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్‌ను యూజ్‌ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా జూమ్‌ రికార్డు చేస్తోన్నట్లు పలువురు యూజర్లు నివేదించారు. 

యాపిల్‌ మ్యాక్‌ వాడే వారిలో..!
యాపిల్‌కు చెందిన మ్యాక్‌ ల్యాప్‌ట్యాప్స్‌లో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ మ్యాక్‌ ల్యాప్‌టాప్స్‌లోని జూమ్‌ యాప్‌లో బగ్‌ ఉన్నట్లు ఆయా యాపిల్‌ మ్యాక్‌ యూజర్లు నివేదిస్తున్నారు. యూజర్లు జూమ్‌ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించని సమయంలో కూడా జూమ్‌ యాప్‌ మైక్రోఫోన్‌ను, వీడియోను ఆన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా యాపిల్‌ మ్యాక్‌ యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు.

కాగా పలుమార్లు ఈ సమస్యపై ఫిర్యాదు రావడంతో సమస్యను పరిష్కరించడానికి జూమ్‌ గత ఏడాది డిసెంబర్‌లోనే వెర్షన్‌ 5.91.(3506) అప్‌డేట్‌ను విడుదల చేసింది. కాగా తాజా అప్‌డేట్‌ సమస్యను పరిష్కరించలేదు. ఈ సమస్య తిరిగి ఆయా యాపిల్‌ మ్యాక్‌ యూజర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. మైక్రోఫోన్‌, వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు యాపిల్‌ మ్యాక్‌ తన యూజర్లను అలర్ట్‌ చేస్తోంది. కాగా  ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని జూమ్‌ తెలిపింది.

చదవండి: గూగుల్‌ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top