‘నాటు నాటు’ ఫీవర్‌: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్‌ మహీంద్ర

Anand Mahindra Shares Puppet Dance for Naatu Naatu Video check here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   సంచలనాలు నమోదు చేసిన టాలీవుడ్‌  ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’  పాట హవా ఇంకా ప్రపంచంలో ఎక్కడో ఒక మూలకొనసాగుతూనే ఉంది. ఆస్కార్ అవార్డుతో ప్రపంచవ్యాప్త కీర్తిని దక్కించుకున్న ఈ పాటకు  పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇకసామాన్య ప్రజానీకి గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికే ఆ సాంగ్‌పై  రామ్ చరణ్ తో కలసి ఈ పాటకు స్టెప్స్  వేసిన పారిశ్రామిక వేత్త , ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా  ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేశారు. 

 ఇదీ చదవండి: ట్యాక్స్‌పేయర్ల కోసం స్పెషల్ యాప్‌, ఎలా పనిచేస్తుంది?

తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు దీనికి మరింత ఆసక్తికరమైన కామెంట్‌ కూడా యాడ్‌ చేశారు. ఒకే ఒక్క. లాస్ట్ ట్వీట్.  దీన్ని పోస్ట్‌ చేయకుండా నిలవరించుకోవడం నా వల్ల కావడంలేదు.. నాటునాటుపై హామీ ఇస్తున్నా.. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే కదా తార్కాణం.  ఇప్పటికీ  ఇది ప్రపంచం మొత్తాన్ని షేక్‌ చేస్తోంది అంటూ  ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోతో ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం

సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top