Anand Mahindra Replies To User Question On Tata Motors - Sakshi
Sakshi News home page

Anand Mahindra: సార్‌.. టాటా కార్లపై మీ ఫీలింగ్‌? ఆనంద్‌ మహీంద్రా ఆన్సర్‌ ఏంటంటే..

Jul 11 2022 9:00 PM | Updated on Jul 11 2022 9:27 PM

Anand Mahindra Replies To Question On Tata Motors - Sakshi

ప్రత్యర్థి కంపెనీ టాటా కార్లపై తన అభిప్రాయాన్ని ఖుల్లాగా చెప్పేశారు ఆనంద్‌ మహీంద్రా.. 

Anand Mahindra Tweet on Tata Motors: దేశంలో టాటా మోటార్స్‌, మహీంద్రా వాహనాలకు క్రేజ్‌ మామూలుగా ఉండదు. అదే సమయంలో మార్కెట్‌లో ఆ రెండింటి మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. అయితే ప్రత్యర్థి కంపెనీ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికరమైన సమాధానమే ఇచ్చారు. ఆ సమాధానం నెటిజన్ల మనసును దోచుకుంటోంది ఇప్పుడు.

ఓ ట్విటర్‌ యూజర్‌.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 గురించి పొగడ్తలు గుప్పిస్తూ శనివారం నాడు ఓ ట్వీట్‌ చేశాడు. దానికి ఆనంద్‌ మహీంద్రా బదులు కూడా ఇచ్చారు. అయితే.. ఆ సంభాషణకు కొనసాగింపుగా మరో యూజర్‌.. ‘సర్‌.. టాటా కార్ల మీద మీ ఫీలింగ్‌ ఏంటి?’ అని ప్రశ్నించాడు. దానికి ఆయన అంతే పాజిటివ్‌గా స్పందించారు. 

టాటా మోటార్స్‌ వంటి బలమైన పోటీదారులు ఉండడం ఎంతో ప్రత్యేకం.  వారు తమను తాము(టాటా మోటార్స్‌) పునర్నిర్మించుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ల ప్రయత్నం మరింత మెరుగ్గా పని చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది… పోటీతత్వం అనేది ఎప్పుడూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది అని చాలా చాలా సానుకూలంగా స్పందించారు ఆనంద్‌ మహీంద్రా. 

ఎప్పుడూ కూల్‌గా సమాధానమిచ్చే ఆనంద్‌ మహీంద్రా.. ఈసారి పోటీ కంపెనీపై ట్వీట్‌తో ఎంతో మంది మనసులను దోచుకున్నారు కూడా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement