Anand Mahindra Interesting Tweet About Child - Sakshi
Sakshi News home page

భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా

Feb 28 2023 6:55 PM | Updated on Feb 28 2023 8:09 PM

Anand mahindra interesting tweet about child - Sakshi

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఒక బాలుడి గురించి చెప్పుకొచ్చారు, ఇలాంటి వారే భారతదేశం భవిష్యత్తుని నిర్ణయిస్తారని వెల్లడించాడు, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి సుమారు 1600 మంది పిల్లలు హాజరయ్యారు, ఇందులో ఒక బాలుడు తాను ఈ పోటీల్లో పాల్గొనటానికి రాత్రి మొత్తం రెండు బస్సులలో ప్రయాణించి పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగటానికి ముందు ఒక చిన్న కునుకు తీసాడు. జరగబోయే పోటీలో విజయం పొందటమే అతని లక్ష్యం.

ఆనంద్ మహీంద్రా ఈ పోస్టుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి మండే మోటివేషన్ అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది. నిజానికి ఇలాంటివి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి.

కొంత మంది ఈ పోస్ట్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇందులో పిల్లల నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవాలని, వారు అందరికి స్ఫూర్తిదాయకమని, ఆల్ ది బెస్ట్, ఛాంప్ అంటూ.. భారతదేశానికి కీర్తి తెచ్చే అంకితభావం కలిగి మేధావులు ఉంటారని మరికొందరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement