ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు.. | Anand mahindra tweet about praggnanandhaa | Sakshi
Sakshi News home page

Anand Mahindra: ప్రజ్ఞానందపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. నువ్వు 'రన్నరప్' కాదు..

Aug 24 2023 7:53 PM | Updated on Aug 24 2023 9:44 PM

Anand mahindra tweet about praggnanandhaa - Sakshi

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా మరో ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

చదరంగంలో (చెస్) అందరి ద్రుష్టి తనవైపు తిప్పుకున్న 'ప్రజ్ఞానంద' (Praggnanandhaa) ఫైనల్ స్టేజిలో రన్నర్‌గా నిలిచాడు. ఈ గేమ్‌లో కార్ల్‌సన్‌ అద్భుత విజయం సాధించి విన్నర్ టైటిల్ సొంతం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఎవరీ 'మాయా టాటా'? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?

దీనిపైన ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ నువ్వు 'రన్నరప్' కాదు @rpragchess. ఇది మీ గొప్పతనానికి 'రన్-అప్' మాత్రమే. మరో సారి పోరాడటానికి అనేక యుద్దాలు నేర్చుకోవడం అవసరం అంటూ.. నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ పోరాడతావు మనమందరం మళ్ళీ అక్కడ ఉంటామని ట్వీట్ చేసాడు. దీనికి ఇప్పటికీ వేల సంఖ్యలో లైకులు వచ్చాయి, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement