Actress Rakul Preet Singh: Turned To Entrapueneur With Her Start up Starring You App, Details Inside - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: సినిమాలే మీ టార్గెటా? రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మీకో ఛాన్స్‌ ఇస్తోంది?

Jan 22 2022 2:17 PM | Updated on Jan 22 2022 3:44 PM

Actress Rakul Preet Singh Turned To A Entrapueneur With Her Start up Starring You - Sakshi

Rakul Preet Singh along with his brother launched a website: టాలీవుడ్‌ మొదలు బాలీవుడ్‌ వరకు వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జీవితంలో మరో అడుగు ముందుకేసింది. బిజినెస్‌ విమన్‌గా కొత్త కెరీర్‌ ప్రారంభించింది. డిజిటల్‌ టెక్నాలజీని వాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఓ వేదిక ఏర్పాటు చేసింది. 

స్టార్టప్‌
గ్రామీణ ప్రాంతాల నుంచి ముంబై, హైదరాబాద్‌, చెన్నై తదితర నగరాలకు సినిమా అవకాశాల కోసం వచ్చే వారికి ‘ఆడిషనింగ్‌’ ప్రక్రియతో యాక్సెస్‌ అంత సులభంగా దొరకడం లేదు. దీంతో చాలా మందికి సిల్వర్‌ స్క్రీన్‌ ఆశలు ఉన్నా.. అవి అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి వారి కోసం ‘స్టారింగ్‌యూ’ స్టార్టప్‌తో ముందుకు వచ్చింది రకుల్‌.
 
తమ్ముడితో కలిసి
తమ్ముడు అమన్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి స్టారింగ్‌యూ అనే వెబ్‌సైట్‌/యాప్‌ని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రారంభించింది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వారికి ఇదో డిజిటల్‌ వేదికగా పని చేయనుంది. మూవీ సెక్టార్‌కి సంబంధించి 24 క్రాఫ్ట్‌లలో అనుభవం ఉన్న వారు ఈ యాప్‌ ద్వారా తమ డ్రీమ్స్‌ నెరవేర్చుకునేందుకు ట్రై చేయోచ్చు. ఈ మేరకు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో స్టారింగ్‌యూ ఒప్పందం చేసుకుంది.

అచ్చంగా వాటిలాగే
జాబ్‌ సీకర్స్‌ కోసం ప్రత్యేకంగా నౌకరీ.కామ్‌, మాన్‌స్టర్‌.కామ్‌ వంటి పోర్టల్స్‌, యాప్స్‌ వచ్చాయి. రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేస్తే చాలు.. కంపెనీల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇటు  ఉద్యోగార్థులకు, అటూ కంపెనీలకు ఈ వెబ్‌సైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ‘స్టారింగ్‌యూ’ కూడా ఇదే పని చేయనుంది. సినిమా ఇండస్ట్రీలో పైకి ఎదిగినట్టుగానే వ్యాపారంలోనూ రకుల్‌ సక్సెస్‌ సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సీనియర్‌ యాక్టర్‌ సునీల్‌షెట్టి సైతం ఇదే తరహా బిజినెస్‌ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement