రామయ్య సేవలో ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

రామయ్య సేవలో ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌

Jun 19 2026 12:24 AM | Updated on Jun 19 2026 12:24 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ గురువారం దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామివారికి అధికారులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారిని, ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్వో సాయిబాబు, డిప్యూటీ తహసీల్దార్‌ ధనియాల వెంకటేశ్వర్లు, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement