గరిష్టం / కనిష్టం
380 / 260
వాతావరణ ం
జిల్లాలో గురువారం ఉష్ణోగ్రత తక్కువగానే నమోదవుతుంది. సాయంత్రం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది.
● నేటి నుంచి కిన్నెరసానిలో సఫారీ టూర్ ● వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
పాల్వంచరూరల్: జూపార్క్‌లో బోన్ల నడుమ జంతువులు, గూళ్లలోని పిచుకలను చూడాల్సిన పనిలేదు. దట్టమైన అడవిలో పచ్చని అందాలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలారావాలు వింటూ చెంగుచెంగున ఎగిరే జింకలను చూస్తూ ముందుకు సాగే అవకాశం అందుబాటులోకి వస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని వన్యప్రాణి విభాగం (వైల్డ్‌లైఫ్) ఆధ్వర్యాన జంగిల్ సఫారీ టూర్ గురువారం మొదలుకానుంది. ఈ మేరకు మూడు సఫారీ వాహనాలు ఇప్పటికే చేరుకోగా, ఈ టూర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారని పాల్వంచ డివిజన్ వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బి.బాబు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీఎఫ్‌ఓ జి.కృష్ణగౌడ్ పాల్గొంటారని వెల్లడించారు.
పది కి.మీ. ప్రయాణం
కిన్నెరసాని డీర్ పార్కు నుంచి వాచ్ టవర్ వరకు, అక్కడ నుంచి మొండికట్ట బేస్ క్యాంప్ హరిణి వరకు సఫారీ వాహనాల ద్వారా సఫారీ కొనసాగుతుంది. ఇప్పటికే మూడు వాహనాలు సిద్ధం చేయగా, వాచ్‌టవర్ వరకు ఒకరికి రూ.100, మొండికట్ట హరిణి వరకై తే రూ.200గా టికెట్ ధర నిర్ణయించారు. ఈ టూర్ ద్వారా పర్యాటకులు చుక్కల జింకలు, అడవి దున్నలు, సాంబార్‌లను చూడొచ్చు. అంతేకాక గైడ్లతో కలిసి అడవిలో ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా కల్పించనున్నారు.


