● ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులకు ఆస్కారం ● వరి సాగు తగ్గించాలంటున్న వ్యవసాయ శాఖ ● ప్రత్నామ్నాయ పంటలు వేయాలంటూ ప్రచారం ● వైవిధ్య పంటల కొనుగోలుకు మాత్రం దక్కని సర్కారు హామీ | - | Sakshi
Sakshi News home page

● ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులకు ఆస్కారం ● వరి సాగు తగ్గించాలంటున్న వ్యవసాయ శాఖ ● ప్రత్నామ్నాయ పంటలు వేయాలంటూ ప్రచారం ● వైవిధ్య పంటల కొనుగోలుకు మాత్రం దక్కని సర్కారు హామీ

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

● ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థితులకు ఆస్కారం ● వరి సాగు తగ్గించాలంటున్న వ్యవసాయ శాఖ ● ప్రత్నామ్నాయ పంటలు వేయాలంటూ ప్రచారం ● వైవిధ్య పంటల కొనుగోలుకు మాత్రం దక్కని సర్కారు హామీ

6.37 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లా వ్యాప్తంగా గతఖరీఫ్‌ సీజన్‌లో 6.09 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 2.04లక్షల ఎకరాల్లో పత్తి, ఆ తర్వాత స్థానంలో 1.65లక్షల ఎకరాల్లో వరి, 86 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 6.37 లక్షల ఎకరా ల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధి కారులు అంచనా వేశారు. పత్తి 2.10 లక్షల ఎకరా లు, వరి 1.75 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎల్‌నినో ప్రభా వం కారణంగా సాధారణకంటే తక్కువవర్షపాతం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో యాక్షన్‌ ప్లాన్‌లో మార్పు తప్పనిసరైంది.

వరి సాగులో కోతలు

ఖరీఫ్‌లో సవరించిన యాక్షన్‌ ప్లాన్‌ విషయానికి వస్తే జూలై 15లోగా సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉంటే 1.75 లక్షలకు బదులుగా 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించారు. ఒక వేళ లోటు వర్షపాతం నమోదైతే వరి సాగు విస్తీర్ణాన్ని లక్ష ఎకరాలకే పరిమితం చేయాలని వ్యవసాయ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 65వేల ఎకరాల్లో వరికి బదులుగా ఇతర పంటలను వేయాల్సి ఉంటుంది. నీటిని ఎక్కువ వినియోగించే మొక్కజొన్న విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించింది. వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా రైతులు పత్తి వైపు మళ్లితే తిప్పలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో సంతృప్త స్థాయిలో పత్తి సాగు జరుగుతోంది. పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు సమయంలో ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా, పత్తి రైతుకు తిప్పలు పడుతూనే ఉన్నారు. ఈ సాగు ఇంకా పెరిగితే ఇబ్బందలు తప్పవు.

కొంటామనే హామీ ఇస్తేనే..

ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు సాగు చేయాలని ప్రభుత్వం ఎంతగా చెబు తున్నా.. రైతులు ఆ దిశగా మార్పును స్వీకరించడం లేదు. ఎందుకంటే పత్తి, వరి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర అందుతోంది. ఈ తరహాలోనే తృణ ధాన్యాలు, పప్పు దినుసులు ఇతర ప్రత్యామ్నాయ పంటలకోసం జిల్లాస్థాయిలో లేదా మార్కె ట్‌ కమిటీ స్థాయిలోనైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ దన్ను లేకుండా ప్రత్నామ్నాయ పంటల వైపు మళ్లితే బహిరంగ మార్కెట్‌లో ఒడిదుడుకులు వస్తే నిండా మునుగుతామనే ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా ప్రచారాల వల్ల ఆశించిన ఫలితాలు రావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement