ఇష్టారీతిన
నిలుపుతున్న లారీలు
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఇటీవల ఒక్క రోజే నలుగురు మృతి
అవగాహన కల్పిస్తున్నాం..
ప్రమాద ఘటనలు ఇలా..
పాల్వంచ మండలంలోని బీసీయం జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న టిప్పర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పినపాక మండలం ఐలాపురం సమీపంలో బైక్‌పై వస్తున్న ధర్రాజు, బట్టు ప్రశాంత్‌ను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సారపాకలో అటో ఆదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆటోడ్రైవర్ శివ మృతి చెందాడు. మంగళవారం సారపాకలో బైక్‌ను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడంతో చెలికాని గణేశ్ మృతి చెందగా తండ్రి ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న యాష్ ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ సాంబశివరావు, ట్యాంకర్ డ్రైవర్ కోటయ్య తీవ్రంగా గాయపడ్డారు. 9వ తేదీన మర్రికుంట వద్ద జాతీయ రహదారిపై స్కూటీని లారీ ఢీకొన్న ప్రమాదంలో పాల్వంచ మండలం సూరారానికి చెందిన వైష్ణవి, శ్రీవల్లి తీవ్రంగా గాయపడ్డారు. 7వ తేదీన దమ్మపేట మండలం ఆల్లిపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కుంభా మోసి, మెర్ని వరప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇంకా గతనెలలో చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
హెచ్చరిక బోర్డులు ఏవి..?
బీసీఎం రహదారిపై నుంచి ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు 24 గంటలూ రాకపోకలు సాగిస్తుంటాయి. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు సుమారు 50 కిలోమీటర్ల పొడవునా ప్రమాద హెచ్చరిక బోర్డులు కన్పించవు. పాల్వంచ మండలం కేశవాపురం మూలమలుపు వద్ద ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. పదేళ్లుగా బీసీయం జాతీయ రహదారి పనులు సాగుతున్నాయి. హెవీ లోడుతో వాహనాలు వెళ్లుండటంతో గతంలో నిర్మించిన రోడ్డు ఎత్తుపల్లాలుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. ఇప్పటికై నా రహదారి పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇల్లెందు నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు, నవభారత్ నుంచి పెద్దమ్మగుడి వరకు రహదారిపై బూడిద ట్యాంకర్లతోపాటు ఇసుక లారీలు నిబంధనలకు విరుద్ధంగా నిలుపుతున్నారు. దీంతో ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రోడ్డుపై వాహనాలను నిలపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రహదారిపై ప్రమాదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. డ్రైవర్ల అజాగ్రత్త, కండిషన్ లేని వాహనాలు, రోడ్డు మలుపులు, మితిమీరిన వేగం.. ఇలా పలు కారణాలతో బీసీయం జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవిస్తూ క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాద సూచిక, హెచ్చరిక బోర్డులు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమతోంది. ఆపద సమయాల్లో చికిత్స, ఇతర అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన హైవే అంబులెన్స్‌ల సేవలు అంతంతమాత్రంగానే ఉండటం ఆందోళన చెందే అంశం. – పాల్వంచరూరల్
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలతోపాటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలి. కారు నడిపేవారు సీట్ బెల్టు పెట్టుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపితే జరిమానా విధిస్తున్నాం. – సతీశ్‌కుమార్, డీఎస్పీ, పాల్వంచ


