ప్రశాంతంగా ఇంటర్‌ ద్వితీయ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఇంటర్‌ ద్వితీయ పరీక్షలు

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

ప్రశాంతంగా ఇంటర్‌ ద్వితీయ పరీక్షలు

ప్రశాంతంగా ఇంటర్‌ ద్వితీయ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా జనరల్‌ విభాగంలో 6,622 మంది, ఒకేషనల్‌ విభాగంలో 1,822 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తంగా 194 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రశ్నపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీల నడుమ సాగుతున్నాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement