సింగరేణి ఓసీలో రేసింగ్‌ పావురం | - | Sakshi
Sakshi News home page

సింగరేణి ఓసీలో రేసింగ్‌ పావురం

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

సింగరేణి ఓసీలో రేసింగ్‌ పావురం

సింగరేణి ఓసీలో రేసింగ్‌ పావురం

మణుగూరు రూరల్‌ : మణుగూరు సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనిలో రేసింగ్‌ పావురం లభ్యమైంది. దాహార్తి తీర్చుకునేందుకు గనిలోకి వచ్చిన పావురానికి ట్యాగ్‌ ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు సింగరేణి అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సింగరేణి అధికారులు ఆ పావురాన్ని పోలీసుల సమక్షంలో అటవీశాఖ అధికారులకు అందజేశారు. పావురానికి ఉన్న ట్యాగ్‌ను పరిశీలించిన అఽటవీ అధికారులు.. చైన్నెలోని ప్రముఖ రేసింగ్‌ సొసైటీకి చెందినదిగా గుర్తించారు. రేసింగ్‌లో భాగంగా పావురం మహబూబాబాద్‌ జిల్లా నుంచి మణుగూరు వైపుగా వస్తూ గనిలోని నీటిని చూసి దాహార్తిని తీర్చుకునేందుకు ఆగినట్లు తెలుస్తోందని తెలిపారు. పావురాన్ని వదిలేస్తే యజమాని వద్దకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

అటవీ శాఖకు అప్పగించిన

అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement