ఐఎల్‌ఓ ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఐఎల్‌ఓ ప్రమాణాలు పాటించాలి

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

ఐఎల్‌ఓ ప్రమాణాలు పాటించాలి

ఐఎల్‌ఓ ప్రమాణాలు పాటించాలి

కొత్తగూడెంఅర్బన్‌: అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) ప్రమాణాలు పాటించాలని సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎల్‌వి. సూర్యనారాయణ, డైరెక్టర్‌(ఈ అండ్‌ఎం) ఎం.తిరుమలరావు సూచించారు. గని కార్మికులకు కోల్‌ వర్కర్‌ నిమోకోనియోసిస్‌ నిర్ధారణ కోసం జరిపే చెస్ట్‌ రేడియోగ్రాఫ్‌ క్లాసిఫికేషన్‌పై అవగాహన కల్పించేందుకు గురువారం కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్‌లో జోనల్‌ వర్క్‌షాపు నిర్వహించారు. డీజీఎంఎస్‌(డైరక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ ) సహకారంతో ఓహెచ్‌ఎస్‌ డాక్టర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులందరికీ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు రోజులపాటు వర్క్‌షాపు సాగుతుందని చెప్పారు. డీజీఎంఎస్‌ అడ్వైజర్‌, రిటైర్డ్‌ డీఎంఎస్‌ డాక్టర్‌ కౌశిక్‌ సర్కార్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వృత్తి, ఆరోగ్య విధానాలను అమలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్‌.కిరణ్‌ రాజ్‌ కుమార్‌, సాయిబాఋ, కృష్ణ గోపాల్‌ తివారీ, ఎం.ఉష, రమేష్‌ బాబు, వైద్యులు, వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ , ఈఎస్‌ఐసీ తదితర సంస్థల వైద్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement