సీఎం కప్‌లో సింగరేణి విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌లో సింగరేణి విద్యార్థుల ప్రతిభ

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

సీఎం కప్‌లో సింగరేణి విద్యార్థుల ప్రతిభ

సీఎం కప్‌లో సింగరేణి విద్యార్థుల ప్రతిభ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. షార్ట్‌పుట్‌, డిస్కస్‌త్రో విభాగంలో ఎ.వందన ప్రథమ స్థానం, 400 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందెంలో ఎం.సింధు ప్రథమ స్థానం, 3000 మీటర్లు, 1500 మీటర్లు పరుగుపందెంలో ఎం.ఇందు ప్రఽథమ స్థానంలో నిలిచారు. డిస్కస్‌త్రోలో ఎ.వందన ద్వితీయ స్థానంతో రజతపతకం, షార్ట్‌పుట్‌లో ఎ.వందన తృతీయస్థానంతో కాంస్యపతకం, 3000 మీటర్ల పరుగులో ఎం.ఇందు తృతీయ స్థానంతో కాంస్యపతకాన్ని సాధించారు. నెట్‌ బాల్‌ విభాగంలో డీ ప్రణీత, డోలిక రమ్యశ్రీ, బి.వాణి, ఆర్‌ కీర్తిసాయిరెడ్డి, ఎ.శిరీష, వినీల, పి.హర్షిత, ఎస్‌ ఉదయశ్రీ, టి.కళ్యాణి ప్రథమ స్థానంలో నిలిచారు. బాస్కెట్‌ బాల్‌ విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచారు. విజేతలను గురువారం కళాశాలలో సింగరేణి జీఎం ఎడ్యుకేషన్‌ సొసైటీ సెక్రటరీ ఎస్‌ వెంకటాచారి, కరస్పాండెంట్‌ వి దేవందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ శారద, ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సావిత్రి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement