హనుమంతుడి వేషధారణలో ఉపాధ్యాయుడు! | - | Sakshi
Sakshi News home page

హనుమంతుడి వేషధారణలో ఉపాధ్యాయుడు!

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

హనుమం

హనుమంతుడి వేషధారణలో ఉపాధ్యాయుడు!

బెంగళూరు శిక్షణలో ప్రదర్శన

దుమ్ముగూడెం: మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు మోహన్‌కుమార్‌ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ – సౌత్‌ ఇండియా ఆధ్వర్యాన బెంగళూరులో జరుగుతున్న శిక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ నుంచి హాజరైన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ముఖ్య పండుగలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ ప్రదర్శన ఇవ్వగా... మోహన్‌కుమార్‌ హనుమంతుడి వేషధారణలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ విశేషాలతో ప్రదర్శన ఇవ్వడంతో పలువురు అభినందించారు.

ఏపీ ప్రభుత్వం

కక్ష సాధింపు హేయనీయం

చుంచుపల్లి: గిరిజన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌పై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగడం హేయమైన చర్య అని బంజారా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ బానోత్‌ వీరూ నాయక్‌ హెచ్చరించారు. బుధవారం లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పనిచేసిన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌పై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన ఐపీఎస్‌ అధికారిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలి పారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శులు ధరావత్‌ కాన్షీరామ్‌, గుగులోత్‌ కేశవ్‌, గణేష్‌ మహరాజ్‌, ట్రెజరర్‌ బానోత్‌ రమేష్‌ నాయక్‌, జేఏసీ కో–కన్వీనర్లు గుగులోత్‌ భద్రు, ధరావత్‌ కృష్ణ, లావుడ్య హన్మంతు, జాటోత్‌ భరత్‌, గుగులోత్‌ ప్రసాద్‌, ధరావత్‌ నర్సింహా పాల్గొన్నారు.

బ్యాంక్‌ లావాదేవీలపై

అవగాహన తప్పనిసరి

ఖమ్మంమయూరిసెంటర్‌: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లావాదేవీలపై సీసీలు, ఏపీఎంలు అవగాహన కల్పించా లని డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌ సూచించా రు. ఉమ్మడి జిల్లాలోని సెర్ప్‌ సీసీలకు ఆర్థిక అక్షరాస్యతపై ఖమ్మంలోని జిల్లా సమాఖ్య భవనంలో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు అందించే రుణాలను సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కల్పించాలని తెలిపారు. అలాగే, బ్యాంక్‌ లింకేజీ, సీ్త్రనిధి రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ, ప్రభుత్వం నుంచి తిరిగి ఎంత వస్తుందో అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో జయశ్రీ, ఆంజనేయులు పాల్గొన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో

ఒకరికి జైలు శిక్ష

అశ్వారావుపేటరూరల్‌: మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి జైలు శిక్ష, మరో ముగ్గురు వ్యక్తులకు జరిమానా విధించారు. ఎస్‌ఐ యయాతీ రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నెమలిపేట గ్రామానికి చెందిన కణితిపల్లి కాంతారావు, మరో ముగ్గరు వ్యక్తులు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి, నిందితులను బుధవారం దమ్మపేట జ్యుడీడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ బి.భవానీరాణి ఎదుట హాజరు పరిచారు. కాంతారావు అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష, మిగిలిన ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

హనుమంతుడి వేషధారణలో ఉపాధ్యాయుడు!1
1/1

హనుమంతుడి వేషధారణలో ఉపాధ్యాయుడు!

Advertisement
 
Advertisement
Advertisement