సాహిత్యంతో మానవీయ విలువలు | - | Sakshi
Sakshi News home page

సాహిత్యంతో మానవీయ విలువలు

Feb 26 2026 7:36 AM | Updated on Feb 26 2026 7:36 AM

సాహిత్యంతో మానవీయ విలువలు

సాహిత్యంతో మానవీయ విలువలు

అశ్వారావుపేటరూరల్‌: సాహిత్యానికి మానవీయ విలువలను పెంపొందించే శక్తి ఉందని విద్యాశాఖ జిల్లా మానిటరింగ్‌ అధికారి అమృతలూరి నాగరాజశేఖర్‌, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక సూర్య స్కూల్‌ ఆవరణలో భానూదయ సాహిత్య సంస్థ, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శతాధిక బాలకవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను బాల్యం నుంచే ఆంగ్లం వెంట పరుగులు పెట్టించకుండా మాతృభాషను కుడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కవి సమ్మేళనంలో 110మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలపై కవిత్వాన్ని వినిపించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి సైదులు, ఎంఈఓ పి.ప్రసాదరావు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు హరిత, షాహీనా బేగం, కొండలరావు, వీరేశ్వరరావు, సూర్య స్కూల్‌ ప్రిన్సిపా ల్‌ పోతన రాంబాబు, డైరెక్టర్‌ జాహ్న వి, భానూదయ సంస్థ అధ్యక్షుడు సిద్దాంతపు ప్రభాకరాచార్యులు, మడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

విద్యాశాఖ జిల్లా మానిటరింగ్‌ అధికారి

నాగరాజశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement