నేడు రాష్ట్రపతి నుంచి కలెక్టర్‌కు అవార్డు
చుంచుపల్లి: జల్ సంచయ్ జన్ భాగీదారీ (జేఎస్‌జేబీ) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నీటి సంరక్షణ పనుల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి, బహుమతికి ఎంపికై ంది. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అవార్డు అందుకోనున్నారు. అవార్డు స్వీకరించేందుకు కలెక్టర్‌తోపాటు డీఆర్‌డీఓ విద్యాచందన సోమవారం ఢిల్లీకి వెళ్లారు. జల్ సంచయ్ జన్ భాగీదారీలో జిల్లావ్యాప్తంగా 29,103 నీటి సంరక్షణ పనులను విజయవంతంగా చేపట్టారు. దీంతో జాతీయస్థాయి మూడో జోన్‌లో కేటగిరీ–3లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కగా, రూ. 25 లక్షల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నగదు కూడా సోమవారం జిల్లా అకౌంటుకు చేరింది. దీనిని నీటి సంరక్షణ పనులకు, నీటి సంరక్షణ అవగాహన సదస్సులకు, సాంకేతిక నైపుణ్యతను పెంపొందించటానికి వినియోగించనున్నారు. కలెక్టర్ చొరవతో జిల్లాలో గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు నీటి సంరక్షణ పనులను ముమ్మరంగా చేపట్టారు. జీఎస్‌ఎన్ సోక్ పిట్‌గా నామకరణం చేసి విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్డుకు ఇరువైపులా ఇంకుడు గుంతలను నిర్మించారు. జిల్లాలో 2,358 మ్యాజిక్ సోక్ పిట్లు, 806 ఫారం పాండ్స్, 1,255 డీసెల్ టేషన్ వర్కులు, 25 పెర్క్యులేషన్ ట్యాంకులు, 24,421 జీఎస్‌ఎన్ సోక్ పిట్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఐటీసీ నుంచి దుమ్ముగూడెం మండలంలో 50, చర్ల మండలంలో 183 ఫారం పాండ్లను నిర్మించారు. సింగరేణి ఆధ్వర్యంలో 5 నీటి వనరులను కోల్ బెల్ట్ ఏరియాల్లో చేపట్టారు.
జల్ సంచయ్ జన్ భాగీదారీలో
ఉత్తమ ప్రతిభ


