వణికిస్తున్న విషజ్వరాలు.. | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న విషజ్వరాలు..

Jul 7 2025 6:23 AM | Updated on Jul 7 2025 6:23 AM

వణికి

వణికిస్తున్న విషజ్వరాలు..

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్వల్ప కాలంలోనే జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని ఆదేశాల జారీ చేసినా.. తూతూమంత్రంగా నిర్వర్తిస్తుండడంతో ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తి తగ్గడం లేదు. పారిశుద్ధ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మురుగు కాల్వల్లో వ్యర్థాలు, పూడిక తీయక నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా తయారైంది.

ఆస్పత్రులు కిటకిట..

భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రి ఓపీ 100 నుంచి 200కి పైగా ఉంటుందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనూ సాధారణ రోజులో కంటే రెండింతలు ఎక్కువే వస్తున్నారు. ప్రస్తుతం విష జ్వరాలు, డెంగీ వ్యాధులు ప్రబలే కాలం కావడంతో రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యాన గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటా సర్వే చేస్తుండగా జ్వరపీడితులు ఆర్‌ఎంపీలను ఆశ్రయించడం లేదా జ్వరం తగ్గకపోతే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు.

ప్రైవేట్‌లో దోపిడీ...

విషజ్వరాలు ప్రబలడంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. యజమానులు, వైద్యులు అడిగినంత చెల్లించుకోవాల్సి వస్తోంది. ఏజెన్పీ గ్రామాల్లో విషజ్వరాలు పెరిగిపోతుండడంతో స్థానికంగా ఏ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లినా రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ముఖ్యంగా మెడికల్‌ మాఫియా జోరు కొనసాగుతోంది. గతంలో డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులకు పరీక్షల పేరిట రూ.1800లు వసూలు చేయగా ఇప్పుడు భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇక సీబీపీ, టైఫాయిడ్‌, మలేరియా, సీఆర్‌పీ పేరుతో రూ.2 వేలకు బదులు రూ.800లు వసూలు చేస్తున్నారు. కాగా, ఈ రేట్లను కొంతమంది మాత్రమే అనుసరిస్తున్నారని, ఇంకొందరు అవసరం లేకున్నా ఇతర పరీక్షలు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలు ల్యాబ్‌ల వారితో కుమ్మకై ్క రోగుల వద్ద నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. విషజ్వరాలు విస్తరించకుండా అవగాహన కల్పించాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నామమాత్రంగా పర్యటన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏజెన్సీలో విజృంభిస్తున్న దోమలు

జిల్లాలో ఇప్పటికే 25 మలేరియా,

9 డెంగీ కేసుల నిర్ధారణ

రోగులతో కిటకిటలాడుతున్న

ఆస్పత్రులు

పంచాయతీల్లో పడకేసిన పారిశుద్ధ్యం

సర్కారు లెక్కలకు పదింతలు తేడా...

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకరాం ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మలేరియా, 7 డెంగీ కేసులు నమోదయ్యాయి. కాగా ఈ లెక్కలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతకు పదిరెట్లు బాధితులు ఉంటున్నారని తెలుస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జ్వర పీడితులు భారీగా చేరుతున్నప్పటికీ అధికారుల లెక్కల్లో ఆ కేసులు నమోదు కావడం లేదు. వాటి కూడా పరిగణలోకి తీసుకుంటే కేసుల సంఖ్య భారీగా నమోదయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి..

ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నట్లుగా తెలు స్తోంది. దీంతో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన ముందస్తు చర్యలు చేపట్టాం. దోమల నివారణ చర్యలు చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రజలు వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా

ఉంచుకోవాలి. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రుల్లో చూపించుకోవాలి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇష్టానుసారంగా డబ్బులు

దండుకుంటే చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

వణికిస్తున్న విషజ్వరాలు..1
1/3

వణికిస్తున్న విషజ్వరాలు..

వణికిస్తున్న విషజ్వరాలు..2
2/3

వణికిస్తున్న విషజ్వరాలు..

వణికిస్తున్న విషజ్వరాలు..3
3/3

వణికిస్తున్న విషజ్వరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement