నేడు ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజావాణి

Jul 7 2025 6:23 AM | Updated on Jul 7 2025 6:23 AM

నేడు

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో సోమవారం ఉద యం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటి ల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధి కారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.

కిన్నెరసానిలో జలవిహారం

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. డ్యామ్‌, జలా శయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి సౌందర్యాల నడుమ సేదతీరారు. 510 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ. 27,630 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూ రిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.15,030 ఆదా యం సమకూరి నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఐటీఐ విద్యార్థులకు

ఎక్స్‌లెంట్‌ అవార్డు

మణుగూరు టౌన్‌: ప్రభుత్వ ఐటీఐలో చదువుకు ని ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు పూర్వ విద్యార్థులు తెలంగాణ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ శాఖ నుంచి ఎక్స్‌లెంట్‌ అవార్డులు అందుకున్నారు. మణుగూరు ఐటీఐ ప్రిన్సిపాల్‌ బడుగు ప్రభాకర్‌ ఆదివారం వివరాలు వెల్లడించారు. అవార్డు గ్రహీతలు సమీర్‌, ద్వారకామైలను అభినందించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందిన విద్యార్థులను కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఘనంగా సన్మానించారని తెలిపా రు.

నేటి నుంచి శిక్షణ

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలోని అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల నిర్వహణపై రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 21 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని, వీటి నిర్వహణపై ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. పాల్వంచలోని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల, భద్రాచలంలోని కొర్రాజులగుట్ట ఉన్నత పాఠశాలలో శిక్షణ ఉంటుందన్నారు. ల్యాబ్‌లో అత్యాధునిక పరికరాలను వినియోగం, ప్రాజెక్ట్‌లు తయారీ తదితర అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

మానవ హక్కుల వేదిక విచారణ

బూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్‌ బీట్‌లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో ఇటీవల ఫా రెస్ట్‌ అధికారులకు, ఆదివాసీ మహిళలకు మధ్య జరిగిన దాడి ఘటనపై మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిజనిర్ధారణ విచారణ చేపట్టారు. వేదిక ప్రతినిధులు బాధిత ఆదివాసీ మహిళలతో మాట్లాడి పూర్తి వివరా లు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వలస ఆదివాసీ మహిళలపై దాడికి పాల్పడిన ఫారెస్ట్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈఘటనపై ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పం దించకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2005 డిసెంబర్‌ 13 కంటే ముందు నుంచి పోడు సాగుచేసుకుంటున్న వారందరికీ పట్టాలివ్వాలని కోరారు. కొసగుంపు ఘటనపై జ్యుడీషియరీ ఎంక్వైరీ చేయాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కొసగుంపులో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యం, తాగునీటి వసతులను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బదావత్‌ రాజు, ఖాదర్‌బాబా, జిల్లా అధ్యక్షుడు దాగం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి దిలీప్‌, రమేష్‌ బండారి, ఊకే ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి1
1/2

నేడు ప్రజావాణి

నేడు ప్రజావాణి2
2/2

నేడు ప్రజావాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement