
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు కేటాయించాలి
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యులకు రాజీవ్ స్వగృహ ప్లాట్లు కేటాయించాలని సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు కోరారు. ఆదివారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో సుమారు 3,500 మంది సభ్యులు ఉన్నారని, ఇందులో సగం మందికే ఇళ్ల స్థలాలు వచ్చాయని, మిగతా వారికి రాజీవ్ స్వగృహ ప్లాట్లు నాలుగు బ్లాక్‌లు టీఎన్జీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలకు కేటాయించాలని తీర్మానించామని అన్నారు. మధ్య తరగతి ఉద్యోగులు టీఎన్జీవోస్‌లో అధికంగా ఉన్నారని, అందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం టీఎన్జీవోస్ సెంట్రల్ కమిటీకి ఎన్నికై న బాలకృష్ణ, జైపాల్ విజయ్‌కుమార్‌తో పాటు ఇటీవల పదోన్నతులు పొందిన ఎర్రమల శ్రీనివాసరావు, నాగరాజును సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాస్, నాయకులు కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, శ్రీధర్ సింగ్, ప్రకాశరావు, కరణ్‌సింగ్, తాళ్లూరి శ్రీకాంత్, చంద్రశేఖర్, ఏలూరి హరికృష్ణ, రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.