
అవే.. తిప్పలు తప్పవా..?
● లో–లెవెల్ వంతెనలతో ప్రజల కష్టాలు ● అనేక గ్రామాలకు నిలిచిపోనున్న రాకపోకలు ● వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం
చుంచుపల్లి: వర్షాకాలం వచ్చింటే లోతట్టు ప్రాంతా ల ప్రజలు వణికిపోతారు. ప్రతి సీజన్‌లోనూ ఏజె న్సీ ప్రాంత వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు, వరదలతో అనేక గ్రామాలకు లో–లెవెల్ చప్టాలతో రోజుల కొద్దీ రాకపోకలు స్తంభిస్తాయి. అవి దాటే ప్రయత్నంలో ఎదరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. జిల్లాలో అనేకగ్రామాలకు ఇప్పటికీ రహ దారులు, సరైన వంతెన సౌకర్యం లేదు. అత్యవసరమైన చోట హై–లెవెల్ వంతెనలు నిర్మించక పోవడంతో వర్షాకాలం సీజన్ మొత్తం ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటారు. వాగులు, వంకలపై ఎప్పుడో నిర్మించిన లో–లెవెల్ చప్టాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలకు పరిమితమయ్యారు.
గ్రామాలకు రాకపోకలు బంద్
జిల్లాలో 35కు పైగా చిన్న, పెద్ద తరహా వాగులు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో పొంగి పొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ప్రధానంగా జూలై, ఆగస్టు మాసాల్లో కురిసే అతి భారీవర్షాలు, వరదలకు ఎక్కువ ప్రాంతాలు పూర్తి గా జలమయమవుతుంటాయి. లో–లెవెల్ వంతెనలు, కల్వర్టులు వరద పోటుకు గురవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, జూ లురుపాడు, అశ్వాపురం, చర్ల, పినపాక, బూర్గంపాడు, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, అశ్వారావుపేట మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు చెందిన ప్రజ లకు వరద కష్టాలు తప్పడం లేదు. కిన్నెరసాని గేట్లు ఎత్తితే 24 గ్రామాలపై ప్రభావం పడుతుంది.
వరదలతో నష్టాలు
2022 జూలై 16న వచ్చిన వరదతో గోదావరి 70.3 అడుగుల స్థాయిలో ప్రవహించింది. పరిసర గ్రామా లు నీట మునిగాయి. భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని 120 గ్రామాలకు చెందిన 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, సుమారు రూ. 120కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు అంచ నా వేశారు. దాదాపు 10 వేల ఎకరాలకుపైగా పంటల నష్టం జరిగింది. సుమారు 5,400 ఎకరాల్లో పంటలు పూర్తిగా ధ్వంసం కావటంతో రూ.6.50 కోట్ల మేర నష్టం జరగగా.. ఉద్యాన పంటల నష్టం రూ.40.58 లక్షల వరకు ఉంది. పంచాయతీరాజ్, ఆర్‌ఆండ్‌బీ పరిదిలోని రోడ్లు వరద తాకిడి కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్ శాఖకు రూ.9.08కోట్లు, ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.94 లక్షలు, ఎన్‌హెచ్‌లకు రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగింది. సబ్‌స్టేషన్ల ధ్వంసం, స్తంభాలు కొట్టుకపోవడంతో విద్యుత్ శాఖకు రూ.5.80 కోట్ల నష్టం వాటిల్లింది. మిషన్ భగీరథకు సంబంధించి 212 హాబిటేషన్లలో పంపుసెట్లు, ప్యానల్‌బోర్డులు, మంచినీటి పైప్‌లైన్లు, ఇంటేక్‌వాల్స్ వరద పోటుకు గురవ్వడంతో రూ.1.17 కోట్ల మేర నష్టం జరిగింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
పంచాయతీరాజ్ పరిధిలోని లో–లెవెల్ చట్టాల మరమ్మతులతో పాటు కొత్త వాటి కోసం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక వచ్చే వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకొని లో–లెవెల్ వంతెనల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నాం. వీఆర్వోలు, సెక్రటరీలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలు ప్రవాహం దాటకుండా అడ్డుగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పెట్టడమే కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.
–శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, ఈఈ
జిల్లాలో.. లో–లెవెల్ వంతెనలు, కల్వర్టులు..
పీఆర్ లో–లెవెల్ చప్టాలు: 102
ఆర్‌అండ్‌బీ లో–లెవెల్ చప్టాలు: 91
ఎక్కువ వరద పోటుకు గురయ్యేవి: 67
ఎక్కువ ప్రవాహం వచ్చేవి: 43
మధ్యతరహా వరదపోటుకు గురయ్యేవి: 35
మధ్యతరహా వరద కాజ్‌వేలు: 48

అవే.. తిప్పలు తప్పవా..?

అవే.. తిప్పలు తప్పవా..?