
పెదవాగులో చేరిన వరదనీరు
అశ్వారావుపేటరూరల్: మండలంలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండగా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేటతోపాటు మండలంలోని కావడిగుండ్ల, కంట్లం, అనంతారం, గాండ్లగూడెం, గుమ్మడవల్లి, నారాయణపురం, వినాయకపురం, తిరుమలకుంట, నందిపాడు, అచ్యుతాపురం, నారంవారిగూడెంతోపాటు అన్నీ గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. భారీ వర్షాలతో పెదవాగుతోపాటు పంట పొలాల్లోకి వరదనీరు పొటెత్తింది. పెదవాగు నిండుగా ప్రవహించగా, ప్రాజెక్టులో తాత్కాలికంగా గతేడాది నిర్మించిన రిండ్‌బండ్‌కు వరదనీరు పోటెత్తింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

పెదవాగులో చేరిన వరదనీరు