
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి..
కొత్తగూడెంఅర్బన్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటుదామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ల, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగరామవరం, హేమచంద్రాపురం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలకు హాజరై మా ట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీమెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించాలని, రూ.22 వేల కోట్లతో రైతుభరో సా అమలు చేసిందని, రూ.12 వేల కోట్లతో పేదల కు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇళ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి రూ.4 వేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, పెద్దబాబు పాల్గొన్నారు.