
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ
భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్, శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వార్షికాదాయం రూ.3లక్షలకు మించని అభ్యర్థులు శుక్రవారం లోగా http.// twd. telangana gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై ఆబ్జెక్టివ్ టైప్, ఆస్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన శిక్షణ ఇస్తారని తెలిపారు.
ప్రజారోగ్యంపై
దృష్టి పెట్టాలి
డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి
గుండాల : ప్రజల ఆరోగ్యంపై సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జయలక్ష్మి అన్నారు. ఆళ్లపల్లి పీహెచ్‌సీని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, రక్తహీనతపై ప్రతీ గ్రామాన్ని, పాఠశాలలను సందర్శించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. పాము, తేలు, కుక్క కాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని అన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. అనంతరం అనంతోగు బాలికల ఆశ్రమ పాఠశాల, మర్కోడు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి సికిల్‌సెల్ పరీక్షలను పరిశీలించారు. ఆమె వెంట వైద్యాధికారి సంఘమిత్ర, రేవంత్, సీహెచ్‌ఓ సోమ్లా నాయక్, ఎస్‌యూఓ హరికృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, హెచ్‌ఏ నరేష్, శ్రీధర్‌బాబు, రేవతి, సావిత్రి, రమణ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన