
షిరిడీ, తిరుపతికి రైళ్లు...!
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందడంతో భవిష్యత్ వ్యాపార, వాణిజ్య పరంగా ఇతర ప్రాంతాల నుంచి గతంలో కంటే రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుంది. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా భక్తులసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది భక్తులు భద్రాచలం వచ్చి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ఇక్కడి నుంచే షిరిడీ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని అనుకుంటుండగా రైళ్ల సౌకర్యం లేక ఆగిపోతున్నారు. షిరిడీ, తిరుపతికి కొత్తగూడెం నుంచి రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఎన్నోసార్లు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినప్పటికీ ఫలితం కాన రాలేదు. ఇదిలా ఉండగా గత మంగళవారం హైద రాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం భర్తేశ్‌కుమార్‌జైనీ ఆధ్వర్యంలో డీఆర్‌యూసీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం నుంచి డీఆర్‌యూసీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి పాల్గొని ఇక్కడి సమస్యలు వివరించారు. కరోనా సమయంలో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, షిరిడీ, తిరుపతికి రైళ్ల ఏర్పాట్లు, కాకతీయ రైలును మణుగూరు వరకు పొడిగించడం, బెల్గావి రైలు పునరుద్ధరణ లాంటి అంశాలను లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాకపోకలు సాగించే రైళ్లు ఇలా..
కొత్తగూడెం రైల్వేస్టేషన్ నుంచి నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఏడు రైళ్లు రాకపోకలు సాగించేవి. సింగరేణి, కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు, డోర్నకల్, విజయవాడ కాజీపేట, కాకతీయ ప్యా సింజర్లతోపాటు మణుగూరు సూపర్‌ఫాస్ట్ సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం మణుగూరు సూపర్‌ఫాస్ట్, సింగరేణి ఎక్స్‌ప్రెస్, కాకతీయ ఎక్స్‌ప్రెస్, విజయవాడ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. బెల్గావి రైలు ను 2024 జనవరి నుంచి రద్దుచేశారు. ఇదిలా ఉండగా.. అమృత్ పథకంలో భాగంగా భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పనులపై కూడా డీఆర్‌ఎం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పను లు వేగవంతం చేయాల్సిన అవసరముంది.
అత్యధిక ఆదాయం..
ఆదరణ కరువు..
పారిశ్రామిక జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూ డెం నుంచి నిత్యం ఉద్యోగులు, వ్యాపారులు, విద్యా ర్థులు, కాంట్రాక్టర్లు, అధికారులు పలు అవసరాల నిమిత్తం వచ్చి వెళ్లే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారు లు ఆదాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రయాణికుల సౌకర్యాలను గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యధిక ఆదాయం భద్రాచలంరోడ్డు రైల్వేస్టేషన్ నుంచే గడిస్తున్నారు. బొగ్గు రవాణా ద్వారా ఏడాదికి సుమారు రూ.650 కోట్లకుపైగా ఆదాయం పొందుతున్నారు. కరోనా సమయం నుంచి బీడీసీఆర్ స్టేషన్ నుంచి నడిచే రైళ్లు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సేవలందించడం లేదు.
డీఆర్‌యూసీసీ సమావేశంలో చర్చ
చిగురిస్తున్న భక్తులు, ప్రజల ఆశలు
రద్దయిన రైళ్లకు మోక్షం కలిగేనా?
అత్యధిక ఆదాయం వచ్చే
కొత్తగూడెం స్టేషన్‌పై డీఆర్‌ఎం దృష్టి..
రైల్వే డీఆర్‌ఎం హామీ ఇచ్చారు..
భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ, తిరుపతికి రైళ్లు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటా మని డీఆర్‌ఎం హామీఇచ్చారు. ఆయన హామీ ప్రకా రం రైళ్లు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వాహనాలు, బస్సు ల్లో వెళ్లే బాధలు తప్పుతాయి. రైలు ఏర్పాటుతో కుదిరిన సమయంలో మొక్కులు తీర్చుకునే అవ కాశం భక్తులకు దొరుకుతుంది.
–శ్రీనివాసరెడ్డి, రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడు

షిరిడీ, తిరుపతికి రైళ్లు...!