
బడి బస్సులు భద్రమేనా?
● ఫిట్‌నెస్ లేకున్నా కొన్ని బస్సులకు సర్టిఫికెట్ల జారీ ● 33 బస్సుల లైఫ్‌టైం ముగిసినట్లు నిర్ధారణ ● ఇంకా కొన్ని ఫిట్‌నెస్ పరీక్షలకు రాని బస్సులు
కొత్తగూడెంటౌన్: విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది. విద్యాసంస్థల బస్సులను ఆర్టీఏ కార్యాలయాలకు కొందరు తీసుకురాగా మరికొందరు తీసుకురాకుండానే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. 2025 ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు దాదాపు 1,392 వాహనాలను తనిఖీల్లో పట్టుకుని సీజ్ చేయ గా నిబంధనలు పాటించని వాహనాల ద్వారా ఫైన్‌ల రూపంలో దాదాపుగా రూ.2కోట్ల 26లక్షలను ఆర్టీఏ అధికారులు రాబట్టా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా దాదాపు 256 విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఉన్నాయి. మే నుంచి జూన్ 27 వరకు 219 బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు చేయించినట్లు, అవి ఫిట్‌గా ఉన్నట్లు తేలింది. మరో 33 బస్సులు లైఫ్‌టైం ముగియడం, అందులో కొన్ని ఇంకా ఫిట్‌నెస్ టెస్టుల కు రాలేదని జిల్లా రవాణాశాఖ ఇన్‌చార్జ అధికారి (ఆర్‌టీఏ) వెంకటరమణ తెలిపారు. అయితే మే నెలలో దాదాపు చాలావరకు బస్సులను ఫిట్‌నెస్ కోసం కార్యాలయానికి తీసుకురాలేదని, జూన్ నెలఖరు వచ్చే సరికి 219 బస్సులను రవాణాశాఖ కార్యాల యానికి ఫిట్‌నెస్ టెస్టు కోసం తీసుకువచ్చి పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ ఆర్టీఏ ఆధికారులు బడి బస్సుల ఫిట్‌నెస్‌పై తూతూమంత్రంగా టెస్టులు నిర్వహించారని, ఫిట్‌నెస్‌సాధించిన బస్సుల్లోనూ చాలా వరకు ఫిట్‌గా లేవని, అయినా ధికారులు ధ్రువీకరించారని విమర్శలు ఉన్నాయి.
పరీక్షలు పూర్తి చేశాం..
జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులు 256 ఉండగా 219 బస్సులకు ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేశాం. విద్యాసంస్థల బస్సులతోపాటు వివిధ వాహనాలను తనిఖీ చేసి రూ.2.26 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేశాం. ఫిట్‌నెస్‌లు లేకుండా బస్పులు తిరిగితే చర్యలు తప్పవు. మరో 33 బస్సుల లైఫ్‌టైం ముగిసింది. కొన్ని బస్సులు ఇంకా ఫిట్‌నెస్ టెస్టులకు రాలేదు. ప్రతి ఒక్కరూ రవాణాశాఖ నియమ, నిబంధనలు పాటించాలి.
–వెంకటరమణ, ఇన్‌చార్జ్ రవాణాశాఖ అధికారి

బడి బస్సులు భద్రమేనా?