నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Oct 1 2024 3:22 AM | Updated on Oct 1 2024 3:22 AM

నేటి

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

కొత్తగూడెంఅర్బన్‌: డీఎస్సీ – 2024కు 1:3 నిష్పత్తిలో ఎంపికై నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ లేదా మెయిల్‌ కానీ వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లను మంగళవారం నుంచి ఈనెల 4 వరకు పరిశీలిస్తామని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. పాతకొత్తగూడెంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆనందఖని(తెలంగాణ స్కూల్‌)లో ప్రతీ రోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు షెడ్యూల్‌ ప్రకా రం అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. పరిశీలనకు వచ్చినప్పుడు వారి సెల్‌ లేదా మెయిల్‌ కు వచ్చిన మెసేజ్‌ చూపించాల్సి ఉంటుందన్నారు. ఒకటో తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ, టెట్‌ అర్హత పత్రాలు ఒరిజినల్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తీసుకుని రావాలని వివరించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 477 పోస్టులను ఎంపికై న వారితో భర్తీ చేస్తామని తెలిపారు.

ప్రతిభ సాధించిన అభ్యర్థులు వీరే..

టేకులపల్లి: టేకులపల్లికి చెందిన గాడెపల్లి విష్ణుబాబుగౌడ్‌ 75.33 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో జిల్లా నాలుగో ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా తల్లి ఉపేంద్ర కష్టపడి చదివించింది. 1 నుంచి 10 వరకు టేకులపల్లిలో, ఇంటర్‌ కొత్తగూడెం, డిగ్రీ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, పీజీ ఉస్మానియ యూనివర్సిటీలో పూర్తి చేశారు.

రెండు ఉద్యోగాలు సాధించిన ‘సరికొండ’..

మండలంలోని బేతంపూడి గ్రామానికి చెందిన సరికొండ నాగేశ్వరరావు రెండు ఉద్యోగాలు సాధించారు. లాంగ్వేజ్‌ పండిట్‌(తెలుగు) ఓపెన్‌లో 9, ఎస్సీ కేటగరిలో 1, స్కూల్‌ అసిస్టెంట్‌(తెలుగు) ఓపెన్‌లో 26, ఎస్సీ కేటగిరిలో 3వ ర్యాంకు సాధించడం విశేషం. 2023లో భార్య సునీత కేన్సర్‌తో మృతి చెందగా తన ఇద్దరు ఆడ పిల్లలతో పాటు తమ్ముడి పిల్లలను సైతం సాకుతూ కష్టపడిన నాగేశ్వరరావు ఏకంగా రెండు ఉద్యోగాలకు అర్హత సాధించారు. తన భార్య ప్రోత్సాహంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యాయని, నేడు రెండు ఉద్యోగాలు సాధించిన ఆనందాన్ని ఆమెతో పంచుకోలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్‌ఏ తెలుగులో

రెండో ర్యాంక్‌

టేకులపల్లి కొత్తతండా(జి) గ్రామానికి చెందిన లావుడ్యా లక్ష్మి ఎస్‌ఏ తెలుగులో రెండో ర్యాంకు, ఎస్జీటీలో 31వ ర్యాంకు సాధించడం విశేషం. ఆమెకు 2017లో భూక్య కుమార్‌తో వివాహమైంది. అదే సంవత్సరం టీఆర్‌ టీ రాసినా రాకపోవడంతో పట్టుదలతో చదివి ఇప్పుడు రెండు ఉద్యోగాలకు అర్హత సాధించింది.

ఫిజికల్‌ సైన్స్‌లో మొదటి ర్యాంక్‌

దమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన మిద్దె హరికిరణ్‌ ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో హైదరాబాద్‌ జిల్లా స్థాయిలో (నాన్‌ లోకల్‌ కోటా) మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఈ సందర్భంగా హరికిరణ్‌ను పలువురు అభినందించారు.

‘పేట’ అభ్యర్థుల ప్రతిభ

అశ్వారావుపేటరూరల్‌: డీఎస్సీ ఫలితాల్లో అశ్వారావుపేట మండల అభ్యర్థులు ప్రతిభ చాటారు. వినాయకపురం గ్రామానికి చెందిన రొయ్యల సత్యనారాయణ, కళావతి దంపతుల కుమారుడు గణేష్‌ జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. ఏడో తరగతి వరకు వినాయకపురం ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10 వరకు కొత్త మామిళ్లవారిగూడెం హైస్కూల్‌లో చదివాడు. అశ్వారావుపేటలో ఇంటర్‌, సత్తుపల్లిలో డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన ఉప్పల శ్రుతి బీసీ బీ కేటగిరీలో 22వ ర్యాంక్‌ సాధించారు.

అన్నపురెడ్డిపల్లిలో ఇద్దరికి..

అన్నపురెడ్డిపల్లి : డీఎస్సీ ఫలితాలలో మండలానికి చెందిన ఇద్దరు ఉత్తమ ర్యాంకులు సాధించారు. స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌ విభాగంలో తొట్టిపంపు గ్రామానికి చెందిన బొడ్డుపల్లి పెద్దిరాజు 77.77 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించారు. గత మార్చిలో విడుదలైన గురుకుల ఉపాధ్యాయ ఫలితాల్లోనూ టీజీటీ, పీజీటీలతో పాటు జేఎల్‌ పోస్ట్‌ సాధించి ప్రస్తుతం సత్తుపల్లి గురుకులంలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్లోజి అచ్చయ్య స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ విభాగంలో 65.90 మార్కులతో జిల్లా 23వ ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు ఆయన సొంతం కానుంది. అచ్చయ్య ప్రస్తుతం ‘సాక్షి’ అన్నపురెడ్డిపల్లి మండల విలేకరిగా పనిచేస్తున్నారు.

సత్తాచాటిన గిరిజన యువకుడు

దుమ్ముగూడెం : డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని మహాదేవపురం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు సొందె ఆంజనేయులు 76.07 మార్కులతో జిల్లా స్థాయిలో జనరల్‌ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించాడు. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, భద్రాచలం ఏజెన్సీ బీఈడీ కాలేజీలో డీఈడీ పూర్తి చేశాడు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపాధ్యాయ కొలువు రానుండడంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జనరల్‌లో ఏడో ర్యాంక్‌..

పాల్వంచరూరల్‌ : పాల్వంచ మండలంలోని కిన్నెరసాని గ్రా మానికి చెందిన గోకినపల్లి అప్పారావు జనరల్‌ కేటగిరీ(సోషల్‌ విభాగం)లో ఏడో ర్యాంక్‌ సాధించారు. అప్పారావు యానంబైల్‌లో పదో తరగతి వరకు, పాల్వంచలో ప్రభుత్వ కాలేజీలో ఇంట ర్‌, డిగ్రీ, బీఈడీ నాగార్జునసాగర్‌లో పూర్తి చేశారు.

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన1
1/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన2
2/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన3
3/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన4
4/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన5
5/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన6
6/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన7
7/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన8
8/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన9
9/9

నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Advertisement
 
Advertisement
Advertisement