44వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న క్రీడాకారులు
కార్యక్రమంలో మాట్లాడుతున్న రవినాయుడు
జె.పంగులూరు: చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ తద్వారా మంచి భవిష్యత్తు సాధించాలని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపాపరు. స్థానిక జూనియర్ కళాశాలలో శుక్రవారం 44వ బాలబాలికల (18 సంవత్సరాలలోపు) ఖోఖో పోటీలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి ముందుగా క్రీడాకారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా పతకాలను ఆవిష్కరించారు. ప్రాంగణంలో క్రీడాకారులు మార్చి ఫాస్టు నిర్వహించారు. అంతర్జాతీయ క్రీడాకారులు క్రీడా జ్యోతిని శాప్ చైర్మన్ రవినాయుడుకి అందించగా ఆయన వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ పంగులూరులో ఖోఖో నిర్వహణ చూస్తుంటే ఆనందంగా ఉందంటూ నిర్వాహకులను అభినందిచారు. మొట్ట మొదటిసారిగా ఖోఖో మెడల్ సాధించిన క్రీడాకారులకు డీఎస్సీలో నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా గ్రామస్తులు క్రీడను ఆదరిస్తున్నారని తెలిపారు. మొట్టమొదటి సారిగా రెండు సార్లు జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు బంగారంతో చేసి బంగారు మెడల్ అందిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేకేఐఎఫ్ సెక్రటరీ సీతారామిడ్డి, డీఎస్‌డీఓ శ్రీనివాసరావు, రాజరాజేశ్వరి, ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. హనుమంతురావు, రఘుబాబు, గ్రామస్తులు రావూరి రమేష్, వీరనారాయణ, రామారావు, రాయిని వెంకటసుబ్బారావు, కర్రి సుబ్బారావు పాల్గొన్నారు.
క్రీడా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించిన శాప్ చైర్మన్ రవినాయుడు
అంతర్జాతీయ స్థాయిలో పంగులూరుకు
క్రీడలో గుర్తింపు
ర్యాలీ నిర్వహించిన క్రీడాకారులు
44వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం


