బాపట్ల
న్యూస్‌రీల్
అంతర్జాతీయ పోటీలకూ సిద్ధం
ఇక్కడ జరిగిన పోటీలివీ..
1994లో జూనియర్ బాలురు, బాలికల స్టేట్ మీట్ 1996 రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడల్లో భాగంగా ఖోఖో మీట్ 1997, 1999లో సీనియర్ సీ్త్ర, పురుషుల స్టేట్ మీట్ 2006లో స్కూల్ గేమ్స్ అండర్ 19 స్టేట్ మీట్ 2013లో రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల పోటీలు 2008లో స్కూల్ గేమ్స్ అండర్ 19 జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ 2011లో మహిళలు, పురుషుల జాతీయ స్థాయి పోటీలు 2017లో దక్షిణ భారత స్థాయి మహిళలు, పురుషుల పోటీలు
క్రీడకు పుట్టిల్లుగా పంగులూరుకు ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వందల మందికి పెద్దసంఖ్యలో పతకాలు 44వ రాష్ట్ర స్థాయి పోటీలకు సర్వం సిద్ధం
చాలా సంతోషంగా ఉంది
ఖోఖో కర్మాగారం
254 శిక్షణ శిబిరాలు
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని శ్రీ కట్లమ్మతల్లి పరివార దేవతల విగ్రహాల పునఃప్రతిష్ట ఈ నెల 23న జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది.
నీటిపై చేప పిల్లల్లా దూసుకుపోతూ.. గాలిలో దూది పింజల్లా తేలుతూ.. పచ్చికపై కంగారుల్లా పరిగెడుతూ.... ప్రత్యర్థులను టచ్ చేయాలంటే పంగులూరు క్రీడాకారులకే సాధ్యం. ఈ గడ్డపై పుట్టిన ఎందరో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. అలాంటి గడ్డపై శుక్రవారం నుంచి 44వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు మూడు రోజులపాటు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
జె.పంగులూరు: ఖోఖో పేరు వినగానే జె. పంగులూరు అందరికీ గుర్తుకు వస్తుంది. జాతీయ స్థాయి క్రీడాకారులకు నెలవైన ఈ గ్రామం జిల్లా ప్రతిష్టను పెంచింది. ఇంతటి పేరు రావడానికి గ్రామ ప్రజల ప్రోత్సాహం వర్ణింపలేనిది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోయినా గ్రామస్తులు అక్కడి క్రీడాకారులకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో అండగా నిలుస్తున్నారు. వారు జాతీయ స్థాయి క్రీడాకారులగా ఎదిగేందుకు చేస్తున్న సాయం ప్రశంశనీయం.
ఎందరికో ఉద్యోగాలు
ఈ క్రీడా కోటాలో ఎస్సైలుగా ఏడుగురు, సీఐగా ఒకరు ఉద్యోగం పొందారు. కానిస్టేబుళ్లుగా 30 మంది సేవలందిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులుగా 34 మంది, సాఫ్ట్‌వేర్ నిపుణులుగా 27 మంది, ఆర్మీలో సుమారు 25 మంది, అమెరికాలో ఐదుగురు క్రీడాకారులు సేవలు అందిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, మెడికల్ సీట్లు సాధించినవారు 50 మంది ఉన్నారు. అంతేకాక 1992 – 2025 మధ్య సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో వ్యక్తిగత పతకాలు సాధించారు. 40 మంది బంగారు, 50 మంది వెండి, 50 మంది కాంస్యపతకాలు కై వసం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు బంగారు పతకాలు సాధించారు. జాతీయ క్రీడల్లో కాశీవిశ్వనాథ రెడ్డి (బంగారు పతకం), జొన్నలగడ్డ పౌలు (బ్రాంజ్ మెడల్), కంది వెంకటరెడ్డి, రావూరి శ్రీనివాసరావు (బ్రాంజ్ మెడల్), పాలకీర్తి శ్రీను (బ్రాంజ్ మెడల్), పోతిరెడ్డి శివారెడ్డి (బ్రాంజ్ మెడల్), మండవ సౌజన్య (బంగారు పతకం) పతకాలు పొందారు.
పంగులూరు గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాన్నదే నా అభిమతం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఖోఖో ఇండియన్ ఫెడరేషన్ అధికారులు ఇక్కడ పోటీల నిర్వహణ తీరు చూసి ఆశ్చర్యపోయారు. వారే అంతర్జాతీయ పోటీలను పంగులూరులో నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో నిర్వహిస్తాం.
– బాచిన చెంచు గరటయ్య,
రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్
2023లో మలేషియాలో ఖోఖో టెస్ట్ సిరీస్‌లో ప్రతిభ చాటి బంగారు పతకం సాధించా. పంగులూరులో ఖోఖో ఆడటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఆట నాకు బంగారు భవిష్యత్తును ఇచ్చింది. ప్రస్తుతం నేను పీఈటీగా ఉద్యోగం పొంది, విధులు నిర్వహిస్తున్నాను.
– సూరినాయుడు,
అంతర్జాతీయ క్రీడాకారుడు, పీఈటీ
ఈ నెల 19 వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఒకే క్రీడా ప్రాంగణంలో 44వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు నిర్వహించనున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. గ్రామస్తుల సహకారం మరువలేనిది.
– కె హనుమంతురావు,
రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి
ఎనిమిది సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు, రెండు సార్లు జాతీయ స్థాయి పోటీలు, 254 శిక్షణ శిబిరాలు నిర్వహించారు. పంగులూరు ఖోఖో కర్మాగారం అనడానికి ఇవే ఉదాహరణలు. నేను చిన్ననాటి నుంచి ఇక్కడే ఆట నేర్చుకున్నా. ఎంతోమంది క్రీడాకారులకు నేర్పాను.
– రఘుబాబు,
జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు
7
1992లో మాగుంట ఎడ్యుకేషనల్ ట్రస్టు కింద ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి అప్పట్లో బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల స్థాపించారు. ఈ కళాశాలలో భవన నిర్మాణ దాత బాచిన వెంకట్రావు. రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో 1992లోనే వెంకట్రావు ఈ క్రీడా పోటీలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్ది వారికి బంగారు భవిష్యత్ అందించడంలో సహకరించారు. గ్రామస్తుల ఆదరాభిమానాలతో అప్పటి నుంచి ఇప్పటికి 254 శిక్షణ శిబిరాలు నిర్వహించడం విశేషం. ఎంతో మంది క్రీడాకారులు ఉద్యోగాలు సాధించారు. మాజీ శాసన సభ్యుడు, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బాచిన చెంచు గరటయ్య సహకారం అందిస్తున్నారు.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


