ఆలయ భూమి ఆక్రమణ
వేమూరు: తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకుడు దేవాలయ భూమి ఆక్రమించి ఏకంగా షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు. వేమూరు మండలంలోని బలిజేపల్లి గ్రామంలోని గంగా పార్వతి సమేత వాలేశ్వర స్వామి ఆలయలో భూమి ఆక్రమణకు గురైంది. తెలుగు దేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు నిజాంపట్నం సత్యనారాయణ ఆలయ ప్రహరీ పక్కన ఉన్న స్థలం ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆక్కడ షెడ్డు నిర్మాణం నిలిపి వేయాలని పంచాయతీ కార్యదర్శికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. కార్యదర్శి ఆరా తీయగా అనుమతి లేదని తేలడంతో నిర్మాణం నిలిపి వేయాలని హెచ్చరించారు.


