పిచ్చికుక్క స్వైర విహారం
8 మంది చిన్నారులపై దాడి గాయాల పాలైన బాలలు
రేపల్లె : పట్టణంలో పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది చిన్నారులతోపాటు ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. పట్టణంలోని 8వ వార్డులో గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు పలువురు విద్యార్థులు ఆటో కోసం వేచి ఉన్నారు. పిచ్చికుక్క ఒక్కసారిగా పిల్లలపై దాడికి దిగింది. వారు గాయాల పాయలయ్యారు. గమనించిన మహిళ కుక్కను అడ్డుకోబోయారు. ఆమైపెనా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. మహిళతోపాటు అజిత్‌కుమార్, రోహిత్, హర్ష, రిచిత, పూజిత సాయి, చరణ్, నాగబాబు, ప్రేమలు గాయపడ్డారు. గమనించిన స్థానికులు కుక్కను చంపారు. గాయాలపాలైన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాల సూపరిండెండెంట్ డాక్టర్ కొలసాని పృథ్వీ గణేష్ చిన్నారులకు వైద్య చికిత్సలు అందించారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. క్షతగాత్రులు పాటించాల్సిన నియమాలను సూచించారు.
పిచ్చికుక్క స్వైర విహారం
పిచ్చికుక్క స్వైర విహారం


