అయ్యప్ప నామస్మరణతో పులకిస్తున్న గ్రామాలు
సాక్షాత్తూ జ్యోతిస్వరూపుడు అయప్పస్వామి హరిహరసుతుని మాలధారణ 41 రోజులు విష్ణువు...శివుని పేర్ల సంగమంతోనే అయప్పనామం హిందువులకు ఓ ప్రధాన పుణ్యస్థలం శబరిమల 20 వస్తువులతో రెండు అరలతో ఇరుముడి 18 కొండల మధ్య వెలసిన శబరిమల అయప్పస్వామి ఆలయం
రెంటచింతల: దేశంలోని పట్టణ ప్రాంతాలతోపాటు పల్లెలు ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు హరహర పుత్రుడు అయ్యప్పనామస్మరణతో పులకించిపోతుంటాయి. కోట్లాది మంది భక్తులు కఠినమైన 41 రోజులపాటు అయ్యప్పస్వామి మాలలు ధరించి వారి వారి ప్రాంతాలలో పడిపూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. పడిపూజలో అయ్యప్ప స్వామి వారికి 21 రకాల అభిషేకాలతోపాటు వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేపడతారు. సాక్షాత్తూ జ్యోతిస్వరూపుడు అయప్పస్వామి మహిషి అనే రాక్షసిని సంహారించి శబరిమలైలో వెలిశాడని పురాణం ద్వారా తెలుస్తుంది. ధర్మశాస్త్ర మణికంఠుడిగా పేరు పొందిన అయప్పస్వామి కేరళ రాష్ట్రంలోని శబరిమలై హిందువులకు ఓ ప్రధాన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. దేశ నలుమూలల నుంచి 41 రోజుల పాటు నియమాలను పాఠించి ప్రతి ఏటా సుమారు 5 కోట్ల మంది భక్తులు అయప్ప సన్నిధికి చేరుకుని దర్శించుకుంటారు. కార్తికమాసం, సంక్రాంతి సమయలలో అత్యధిక సంఖ్యలో మాల ధారులు శబరిమలై వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. దక్షిణభారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో అధికంగా అయప్పమాలధారణ స్వీకరిస్తారు. ఆంధ్ర శబరిమలైగా పేరుపొందిన ద్వారపూడి శంఖవరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని శబరిమలై వలే నిర్మించడం విశేషం.
ఇరుముడి ప్రత్యేకత
రెండు అరలున్న మూట ఇరుముడి. నేతితో నింపిన కొబ్బరి కాయ, రెండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసుపు, గంధం పొడి, విభూది, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు(వావర్ దర్గాకోసం), తేనే, ఎండు ద్రాక్ష, తువ్వాలు వంటి వస్తువులను ప్రతి అయప్ప మాలధారుడు ఖచ్చితంగా ఇరుముడిగా కట్టుకుంటారు. ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని పల్లికెట్టు అంటారు.
శబరిమల
కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతశ్రేణుల ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య వెలసిఉంది. ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకు ఆలయ తలుపులు తెరచి ఉంచుతారు. 27,28,29, మూడు రోజులు ఆలయ తలుపులు మూసి తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మాలధారులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు తెరచి ఉంచుతారు.
శబరిమలకు మార్గం
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా రోడ్డు మార్గం ఉంది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన పంబ దగ్గర నుంచి ప్రతి భక్తుడు ఇరుముడితో స్వామివారి దర్శనానికి దట్టమైన అడవుల మధ్య సుమారు 7 కి. మీ కాలినడకన వెళ్లాలి. దీనికి మరో మార్గం వండిపెరియార్ నుంచి పులిమేడు కొండ మీదుగా 17 కి. మీటర్లు నడచి వెళ్లాలి. ఈ మార్గంలో పులులు, అడవి జంతువులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో ఈ మార్గం నుంచి తక్కువ మంది భక్తులు స్వామిదర్శనానికి వెళ్తారు.
అయ్యప్ప నామస్మరణతో పులకిస్తున్న గ్రామాలు


