 
															మోంథా తుపానును అడ్డుకొని ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేశా
కూటమి పాలకుల తీరుతో నిండా మునిగిన అన్నదాతలు వేల ఎకరాల పంట మునిగినా ప్రభుత్వ పరంగా చర్యలు శూన్యం పర్చూరు వాగు, రొంపేరు వాగుల పరిధిలో భారీగా ముంపు పూడిక, గుర్రపుడెక్క సకాలంలో తొలగించకపోవడంతో పెను నష్టం సముద్రంలోకి వెళ్లే మార్గం లేక పంట పొలాలను ముంచిన వరద కూటమి సర్కారు ఉదాసీనతపై రైతులు తీవ్ర ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: పర్చూరు, చీరాల నియోజక వర్గాలలోని 50 వేల ఎకరాల వరిని పర్చూరు వాగు, రొంపేరు కాల్వలు నీట ముంచాయి. మూడు రోజులు అవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు వచ్చి చూసి వెళ్లారేగానీ, చర్యలు మాత్రం శూన్యం. కొత్తగా వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్ పలు దఫాలుగా వరద పరిస్థితిని పరిశీలించారు. పంట పొలాల నుంచి నీరు తొలగించడానికి ఆయన కూడా చర్యలు తీసుకోలేదు. తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులు ఆగితే సమస్య దానికదే పరిష్కారం అవుతుందిలే అన్నట్లుగా ప్రభుత్వం, అధికారుల తీరు ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో భారీవర్షం కురిసింది. దీంతో పర్చూరు వాగు, రొంపేరు వాగులు పొంగి ప్రవహించాయి. వీటి ప్రభావంతో సముద్రంలో కలిసే రొంపేరు కుడి కాలువ (వేటపాలెం స్ట్రెయిట్ కట్), ఎడమ కాలువ(ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్)లు పొంగాయి. ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాలువల్లో పూడిక, గుర్రపు డెక్క పెరిగింది. కాలువల నుంచి వరద సముద్రంలోకి వెళ్లక గట్లు దాటి పంట పొలాలను ముంచెత్తింది. పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చిన గంజాం మండలాల పరిధిలో 50 వేల ఎకరాల వరిపంట నీట మునిగింది. మూడు రోజులుగా ఇదే దుస్థితి నెలకొంది. మరో రెండు రోజులపాటు కూడా పొలాల నుంచి నీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. రూ. వేలు పెట్టుబడి పెట్టి 40, 50 రోజులుగా కాపాడుకుంటూ వస్తున్న పంట ఇప్పుడు కూటమి సర్కార్ నిర్లక్ష్యంతోనే వరదపాలు అయిందని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ రెక్కల కష్టార్జితం నీటిపాలు కావడంతో వారు కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉంటే సమస్య తలెత్తేది కాదని చెప్పారు. వారి నిర్లక్ష్యంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.
నాడు వైఎస్సార్ చర్యలకు అడ్డంకులు
2007లో తుపాను ప్రభావంతో ఇప్పటి మాదిరిగానే భారీగా వరదలు వచ్చి పర్చూరు వాగుతోపాటు రొంపేరు కాలువలు పొంగి పొర్లాయి. పరిస్థితిని చూసేందుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించారు. రైతులు తమ కష్టాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మొదలు పర్చూరు మీదుగా పలు వాగులు ఇటుగా వచ్చి పంట పొలాలను ముంచెత్తుతున్నాయని వివరించారు. పర్చూరు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు మీదుగా గుండ్లకమ్మ నది వరకూ డ్రైన్ నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పారు. దీంతో నిర్మాణానికి అంచనాలు తెప్పించిన ఆయన రూ. 150 కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్లకోసం ప్రాజెక్టు అని, దీంతో ఉపయోగం లేదని పచ్చ నేతలు తమ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించారు. కాలువ కోసం భూ సేకరణ చేస్తే తమ పొలాలు పోతాయని, ఇదే జరిగితే ఎన్నికల్లో తమ సామాజికవర్గం ఓట్లేయదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి పురందేశ్వరిపై పచ్చనేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. కాలువ వద్దంటూ వారు వైఎస్ రాజశేఖరరెడ్డిని నిలువరించారని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. నాడు కాలువ నిర్మించి ఉంటే ఈ రోజు వరద వల్ల పంటలు నీట మునిగేవి కావని, రైతులకు మేలే చేసే పని పచ్చ నేతల కుట్ర వల్లే ఆగిపోయి ఈ దుస్థితి పట్టిందని పలువురు అన్నదాతలు ‘సాక్షి’తో చెప్పారు.
 
							మోంథా తుపానును అడ్డుకొని ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేశా
 
							మోంథా తుపానును అడ్డుకొని ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేశా
 
							మోంథా తుపానును అడ్డుకొని ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చేశా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
