 
															ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం
ఈ ఏడాది నాకు ఉన్న రెండెకరాల భూమితోపాటు మరో 65 ఎకరాలను వరి సాగు కోసం కౌలుకు తీసుకున్నా. మొత్తం 67 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు ప్రారంభించా. ఒక్కో ఎకరాకి కౌలు ధర రూ.20 వేలు ఉంటే ఇప్పటి వరకు సాగు ఖర్చు మరో రూ.12 వేలు ఖర్చు అయింది. మొత్తం ఒక్కో ఎకరాకి రూ.32 వేలు ఖర్చు చేశా. మోంథా తుఫాన్‌తో వచ్చిన వరద నీరు ప్రవాహం వలన పొలాలు పూర్తిగా మునిగి పోయాయి. భారీగా నష్టపోయిన మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.
– గవిని శివాజీ, కౌలు రైతు,
కుంకులమర్రు, కారంచేడు మండలం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
