
అద్దంకి సమన్వయకర్తగా డాక్టర్ అశోక్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్‌ను నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యుడైన అశోక్‌కుమార్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందినవారు. పిడుగురాళ్లలో పల్నాడు హాస్పిటల్స్ అధినేతగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటినుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. సమన్వయకర్తగా తనను నియమించిన అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డిలకు అశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ను అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
బాపట్ల అర్బన్: బాపట్ల జిల్లా అంగన్‌వాడీల ద్వితీయ మహాసభ శనివారం చీరాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.శైలశ్రీ తెలిపారు. బాపట్ల కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది ప్రాజెక్టుల్లో నాలుగువేల మంది పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారన్నారు. తమ సమస్యలపై గత ఎన్నికలకు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు పాటు సమ్మె చేసి అనేక జీవోలు సాధించుకున్నామని వివరించారు. ప్రధానంగా వేతనం పెంపు అలాగే ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మహాసభలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొంటారని, జిల్లాలోని అంగన్‌వాడీలంతా పెద్దఎత్తున హాజరుకావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.సీతామహాలక్ష్మి, ఎన్. హేమ పాల్గొన్నారు.