
వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఓబేదు నియామ
రేపల్లె: వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రేపల్లె పట్టణానికి చెందిన చిత్రాల ఓబేదును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఓబేదు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. జగన్ యువసేన నియోజకవర్గ అధ్యక్షుడుగా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడుగా, వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్ష పదవులతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్ర హస్త కళలశాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జగనన్న వెంటే ఉంటానను. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఓబేదు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, రేపల్లె నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ ఈవూరు గణేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓబేదుకు పట్టణానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు అభినందనలు తెలిపారు.